Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • కోవిడ్‌పై పోరు కోసం కిషన్ రెడ్డి ఒక నెల జీతం విరాళం. పీఎం-కేర్స్ నిధికి జీతంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ. 1 కోటి కెటాయింపు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల కేటాయింపు. మరో రూ. 50 లక్షలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తూ లేఖలు.
  • మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో 335 కేసులు,13 మంది మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. మహారాష్ట్రలో పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడిన మోడీ.

No Chance To Rohit Sharma: ఆ జట్టులో కోహ్లీ, ధావన్‌లకు చోటు.. రోహిత్‌కు నో ఛాన్స్..

బంగ్లాదేశ్ గడ్డపై వచ్చే నెలలో ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య రెండు టీ20లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లకు నలుగురు ఆటగాళ్లను పంపనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు.
No Chance To Rohit Sharma, No Chance To Rohit Sharma: ఆ జట్టులో కోహ్లీ, ధావన్‌లకు చోటు.. రోహిత్‌కు నో ఛాన్స్..

No Chance To Rohit Sharma: బంగ్లాదేశ్ గడ్డపై వచ్చే నెలలో ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య రెండు టీ20లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లను మార్చి 18, 21 తేదీలలో నిర్వహించనున్నారు. ఇక ఈ సిరీస్‌లో ఆసియా ఎలెవన్ తరపున భారత్ ఆటగాళ్లు కూడా ఆడనున్నారు. అందులో భాగంగానే టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లను పంపనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లు ఆ మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇక హిట్‌‌‌‌‌‌మ్యాన్ రోహిత్ శర్మకు అవకాశం దక్కలేదని సమాచారం. కాగా, రోహిత్ శర్మ కాలి గాయంతో న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన సంగతి విదితమే. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకుంటున్నాడు.

Also Read: కోహ్లీ కంటే స్మిత్ గ్రేట్.. నెటిజన్లు కామెంట్స్…

Related Tags