అసదుద్దీన్‌ మీ తీరు అభినందనీయం.. నెటిజన్ల ప్రశంసలు

MIM chief Asaduddin Owaisi, అసదుద్దీన్‌ మీ తీరు అభినందనీయం.. నెటిజన్ల ప్రశంసలు

17వ పార్లమెంట్ సమావేశాల్లో రెండోరోజు ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. అయితే ఆయన ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఎన్డీయే వర్గాలు వందే మాతరం, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వారు చేస్తున్నంతసేపు ఇంకా చేయండి అంటూ చేతితో సైగలు ఇచ్చిన అసదుద్దీన్.. తన ప్రమాణ స్వీకారం తరువాత జై భీమ్, జై మీమ్, తక్బీర్ అల్లాహో అక్బర్, జై హింద్ అంటూ ముగించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓవైసీ.. ‘‘భారత రాజ్యాంగం ప్రకారం నేను ప్రమాణస్వీకారం చేసే సమయంలో కొంతమంది స్లోగన్లు చేశారు’’ అంటూ కామెంట్ పెట్టారు.

ఇదిలా ఉంటే పార్లమెంట్‌లో అసదుద్దీన్ ప్రవర్తనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘అవసరం లేకున్నా జై శ్రీ రామ్ నినాదాలను అసెంబ్లీలో వినిపించారు. అలా వినిపించిన వారందరికి అనుగుణంగా అసదుద్దీన్ వ్యవహరించిన తీరు అద్భుతం’’.. ‘‘నేను అసదుద్దీన్ అభిమానిని కాదు. కానీ పార్లమెంట్‌లో ఆయన తీరు నన్ను ముగ్ధుడిని చేసింది’’.. ‘‘ఎంపీగా ఒక వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో బీజేపీ నేతలు ఇలా నినాదాలు చేయడం బాధాకరం’’.. ‘‘ఇది పార్లమెంట్. ఎలక్షన్ వేదిక కాదు. కనీసం పార్లమెంట్‌లోనైనా ఇలాంటి నినాదాలపై నిషేధం విధించాలి’’ అంటూ అసదుద్దీన్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. బీజేపీ నేతల తీరుపై మండిపడుతున్నారు నెటిజన్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *