వ్యూస్ కోసం ఇంట్లోని నగలు, నగదు చూపించిన యూట్యూబర్.. తెల్లారేసరికల్లా ఊడ్చేసిన దొంగలు..!

కన్యాకుమారి యూట్యూబర్ మధుమిత తన ఇంట్లోని భారీ బంగారం, కోటి రూపాయల నగదును వీడియోలలో ప్రదర్శించింది. ఈ వీడియోలు దొంగలను ఆకర్షించాయి. ఇంట్లోకి చొరబడిన దొంగలు 960 గ్రాముల బంగారం, కోటి నగదును చోరీ చేశారు. బహిరంగంగా సంపదను ప్రదర్శిస్తే ఇలాంటి పరిణామాలే ఉంటాయని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

వ్యూస్ కోసం ఇంట్లోని నగలు, నగదు చూపించిన యూట్యూబర్.. తెల్లారేసరికల్లా ఊడ్చేసిన దొంగలు..!
Gold Stolen In Kanyakumari

Edited By:

Updated on: Sep 26, 2026 | 11:30 AM

సాధారణంగా ఇంట్లో బీరువాలలో డబ్బులు, నగలు ఉంటేనే.. మా ఇంట్లో ఏమీ లేవు అన్నట్లు ఉండే రోజులు ఇవి..! అలాంటిది మా ఇంట్లో భారీగా నగలు, కోట్లల్లో డబ్బులు ఉన్నాయంటూ ప్రపంచానికి చూపిస్తే దొంగలు కామ్ గా ఉంటారా? ఎందుకు కామ్ గా ఉంటారు? దర్జాగా ఇంట్లోకి దూరి దోచేశారు. ఇంట్లో జాగ్రత్తగా సీక్రెట్‌గా దాచుకోవాల్సిన డబ్బు, నగలు ఇలా వీడియో రూపంలో అందరికి చూపిస్తే ఇలానే ఇలా ఇల్లే దోచేశారంటూ లబోదిబోమంటుంది ఆ యుట్యూబర్. ఇంతకీ ఆ యుట్యూబర్ ఎవరు ఆమె చేసిన వీడియో ఏంటి తెలుసుకుందాం.

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన మధుమిత అనే వివాహిత యుట్యూబర్‌గా గుర్తింపు పొందింది. వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ పాపులారిటీ సంపాదించింది. ఆమె చేసిన వీడియోలు వైరల్ కాలేదే లేక వ్యూస్, లైక్‌లు రాలేదనో ఏమో కాని ఇంట్లో జాగ్రత్తగా దాచిపొట్టుకోవాల్సిన బంగారం, నగదు వీడియోలు రికార్డ్ చేయడం మొదలు పెట్టింది. ప్రతి నెల ఇంట్లో ఉన్న దబ్బుతో బంగారం కొంటున్నామని తన వద్ద భారీగా బంగారం నగలు ఉన్నాయంటూ పేర్కొంది. ఇంట్లో పూజ గదిలో డబ్బు, నగలు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తున్న వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.

దీంతో ఆ వీడియోలపై దొంగల కన్ను పడింది. ఇంకేముంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి వెనక డోర్ పగులకొట్టి చొరబడి, 960 గ్రాముల బంగారు నగలతో పాటు కోటి రూపాయల వరకు నగదు చోరీ చేశారు. ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లో బంగారు, నగలు లేకపోవడంతో ఆశ్చర్యపోయిన మధుమిత పోలీసులను ఆశ్రయించింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బంగారు, నగలు ఇలా పబ్లిక్ గా చూపిస్తే ఇలాగే జరుగుతుందని సెటైర్లు వేయడంతో పాటు బాగా లైక్‌లు వ్యూస్ వస్తాయి లే అంటూ ఇమోజు లు పెడుతున్నారు నెటిజన్లు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us