ప్రేమికులపై పైశాచికం.. మెడలో టైర్లు వేసి శిక్షించిన గ్రామస్తులు.. రంగంలోకి దిగిన పోలీసులు.. వీడియో చూడండి

|

Sep 22, 2021 | 5:31 PM

ఓ ప్రేమ జంటను దారుణంగా హింసించారు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించి ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంటను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు దారుణంగా..

ప్రేమికులపై పైశాచికం.. మెడలో టైర్లు వేసి శిక్షించిన గ్రామస్తులు.. రంగంలోకి దిగిన పోలీసులు.. వీడియో చూడండి
Follow us on

ఓ ప్రేమ జంటను దారుణంగా హింసించారు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించి ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంటను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు దారుణంగా శిక్షించారు. స్కూటర్‌ టైర్‌ మెడలో వేసి.. డ్యాన్స్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. గ్రామస్తులపై మండిపడుతున్నారు. గ్రామస్తులను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.వివరాల్లోకి వెళితే..

ధార్‌ ప్రాంతంలోని కుండి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడిని ప్రేమించింది. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఈ నెల మొదటి వారంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్‌ కింద కేసు నమోదు చేశారు.

వారం రోజుల తర్వాత..

ఇంటి నుంచి పారిపోయిన ప్రేమకులు వారం రోజుల తర్వాత గ్రామానికి చేరుకున్నారు. ప్రేమికుల ప్రవర్తనపట్ల ఆగ్రహంగా ఉన్న గ్రామస్తులు వారి చేసిన పనికి తగిన శిక్ష విధించాలని భావించారు. గ్రామంలో రచ్చబండ వద్దకు వారిని పిలిపించారు. అనంతరం గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి.. ఆ జంటను కర్రతో పలు మార్లు చితకబాదాడు. అనంతరం వారి మెడలో స్కూటర్‌ టైర్‌ వేసి డ్యాన్స్‌ చేయించారు.

అంతేకాకుండా ఈ ప్రేమ జంటకు సాయం చేసిందనే ఆరోపణలతో 13 ఏళ్ల బాలికను కూడా ఇదే విధంగా హింసించారు. గ్రామస్తుల్లో కొందరు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది తెగ వైరల్‌ అయ్యింది. ఈ వీడియో పోలీసు కంట పడటంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రేమికుల మీద దాడి చేసిన వారిలో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా అడిషనల్‌ సూపరింటెండెంట్‌ దేవేంద్ర పాటిదర్‌ మాట్లాడుతూ.. యువతి ఇంటి నుంచి పారిపోయినందుకు ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. వీరికి సహకరించిన మరో అమ్మాయిపైనా కోపం పెంచుకున్నారు. ప్రేమ జంటతో పాటు ఆమెకు కూడా శిక్షించారు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేశాము. ఇందులో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటాము అని అన్నారు.

 

ఇవీ కూడా చదవండి:

Volcano Eruption: 50 ఏళ్ల తర్వాత పేలిన అగ్ని పర్వతం.. ఇళ్లల్లోకి వచ్చిన లావా.. 100 ఇళ్లు ధ్వంసం

Cars Air Bags: చిన్న కార్లలలో కూడా కనీసం 6 ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండాలి: కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు