Worlds Powerful Passports: ప్రపంచ దేశాల్లో భారత్ పాస్‌పోర్టు విలువ మరింత పెరిగింది. వీసా లేకుండా మరిన్ని దేశాలకు వెళ్లేలా భారత్ పాస్‌పోర్ట్ ర్యాంకు సాధించింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో స్టాండెడ్ పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ ఏడు స్థానాలను మెరుగు పర్చుకుంది. గత సంవత్సరం 90వ స్థానంలో ఉన్న భారత్.. తాజా ర్యాంకింగ్‌లో 83వ స్థానానికి చేరుకుంది. దీంతో వీసా లేకుండా ఇండయా పాస్‌పోర్టుతో 60 దేశాలు తిరిగి రావచ్చు. ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాల్లో స్టాండెడ్ పాస్‌పోర్టు జాబితాను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనే కంపెనీ ప్రకటిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ ర్యాంకింగ్‌లో దూసుకుపోయింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) నుంచి సేకరించిన సమాచారం మేరకు హెన్లీ కంపెనీ 2022లో 199 దేశాలకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది.
మొదటి స్థానాల్లో జపాన్, సింగపూర్..
ఇక ఈ పాస్‌పోర్టు జాబితాలో జపాన్, సింగపూర్ దేశాలు మొదటి స్థానంలో ఉండగా, ఈ రెండు దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 192 దేశాల్లో ప్రయాణించే వెసులుబాటు ఉందని తెలిపింది. ఇక జర్మనీ, దక్షిణ కొరియా పాస్‌పోర్టులు ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. అలాగే ఈ జాబితాలో ఫిన్లాండ్, లక్సెంబర్గ్, స్పెయిన్ దేశాలు 3వ స్థానం దక్కించుకున్నాయి. ఇక 4వ స్థానంలో ఫాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్, డెనన్మార్క్ దేశాలు నిలిచాయి. అలాగే 6వ స్థానంలో అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్ దేశాలు ఉన్నాయి. గత సంవత్సరం ఈ దేశాలు 8వ స్థానంలో నిలిచాయి. వీసా లేకుండా 180 దేశాలలో తిరిగి రావచ్చు.
7వస్థానంలో ఆస్ట్రేలియా, కెనడా, గ్రీక్, మాల్టాలు నిలువగా, పోలాండ్, హంగరీలు 8వ స్థానం దక్కించుకున్నాయి. 9వ స్థానంలో లిథువేనియా, స్లొవేకియాలు ఉన్నాయి. 10వ స్థానంలో ఎస్టోనియా, లాట్వియా, స్లొవేనియాలు ఉన్నాయి. 2022 జాబితాలో మొదటి పది స్థానాల్లో యూరప్ దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌లే ఎక్కువగా ఉన్నాయి. అరబ్ దేశాల్లో యూఏఈ గోల్డెన్ వీసా 15 స్థానం, చైనా 64వ స్థానం ఉండగా, దాయాది దేశం పాకిస్థాన్ 108వ స్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి: