Watch Video: బైక్ ఎక్కిన యువతిని ఎక్కడెక్కడో టచ్ చేశాడు.. పదేపదే వారించినా వినకపోవడంతో..

|

Apr 26, 2023 | 4:38 PM

వేధింపులకు తట్టుకోలేక బైక్‌పై నుంచి దూకింది ఆ యువతి. ఈ దారుణ ఘటన బెంగళూరులో ఈనెల 21 జరిగింది. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు ఈ కామాందుడు. బైక్‌ ఎక్కించుకున్న నిందితుడు

Watch Video: బైక్ ఎక్కిన యువతిని ఎక్కడెక్కడో టచ్ చేశాడు.. పదేపదే వారించినా వినకపోవడంతో..
Rapido Bike Driver Misbehav
Follow us on

బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్‌ దాష్టీకం, బైక్ ఎక్కిన యువతిపట్ల అసభ్యప్రవర్తన, తాకకూడని చోట్ల తాకుతూ వేధింపులు.. పదేపదే వారించినా వినని బైక్ డ్రైవర్‌. వేధింపులకు తట్టుకోలేక బైక్‌పై నుంచి దూకింది ఆ యువతి. ఈ దారుణ ఘటన బెంగళూరులో ఈనెల 21 జరిగింది. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు ఈ కామాందుడు. బైక్‌ ఎక్కించుకున్న నిందితుడు ఓటీపీ వస్తుందనే సాకుతో మొబైల్‌ను తీసుకెళ్లి దురుసుగా ప్రవర్తించాడు. అనంతరం తాను వెళ్లాల్సిన మార్గంలో వెళ్లకుండా దొడ్డబల్లాపూర్ రోడ్డు వైపు బైక్‌ను తిప్పాడు. దీంతో యువతి ఆందోళన చెందడంతో రాపిడో డ్రైవర్ బైక్‌ను మరింత వేగం పెంచాడు.

దీంతో మరింత భయపడిన యువతి నాగేనహళ్లి సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాల ఎదుట బైక్ పై నుంచి రోడ్డుపైకి దూకింది. ఆ యువతి పడిపోవడాన్నిగమనించిన సమీపంలోని ప్రైవేట్ కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను రక్షించారు. ఇది గమనించిన ర్యాపిడో డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.

అదే రోజు ఎళహంక పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు. డ్రైవర్‌ ఏపీకి చెందిన దీపక్‌గా గుర్తింపు. యువతి దూకినప్పుడు వెనక వాహనాలు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. కిందపడి లేచి నడిరోడ్డుపై కుంటుతూనే పరుగులుపెట్టిన యువతి.

స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా..

స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు ర్యాపిడో బైక్ డ్రైవర్‌. అయితే ఫిర్యాదు అందిన 24 గంటలలోపే బెంగళూరు పోలీసులు ఆ కామాందుడిని పట్టుకున్నారు. ఆ యుకుడిని యలహంక ఉపనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిండ్లుకు చెందిన 27 ఏళ్ల దీపక్‌రావు అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఏప్రిల్ 21వ తేదీన యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎంఎస్ కళాశాల సమీపంలో జరిగింది. ఏప్రిల్ 21వ తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు యువతి రాపిడో బైక్‌ను బుక్ చేసుకుంది. అయితే ఓటీపీ చూస్తాననే సాకుతో మొబైల్‌ను తీసుకుని దురుసుగా ప్రవర్తించాడు.

పరారైన ర్యాపిడో బైక్ డ్రైవర్‌ను యలహంక ఉపనగర్ పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిండ్లుకు చెందిన 27 ఏళ్ల దీపక్‌రావు అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఏప్రిల్ 21వ తేదీన యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎంఎస్ కళాశాల సమీపంలో జరిగింది. ఏప్రిల్ 21వ తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు యువతి రాపిడో బైక్‌ను బుక్ చేసుకుంది.

సీసీ టీవీలో రికార్డైన దృశ్యాలు..

బెంగళూరులోని ఎళహంకలో జరిగింది ఈ ఘటన. డ్రైవర్ దీపక్ అసభ్యచేష్టలకు తాళలేక బైక్‌పై నుంచి యువతి దూకేసిన దృశ్యాలు సీసీఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఈ నెల 21న రాత్ర 11గంటల తర్వాత ఈ సీన్ జరిగింది. ఇందిరానగర్‌ నుంచి బయటల్దేరిన ఆ యువతి నుంచి ఓటీపీ చెకింగ్ కోసమని చెప్పి ఓ సారి ఫోన్ కూడా లాక్కున్నాడు దీపక్. ఫుల్లుగా మద్యం సేవించి 60కిలోమీటర్ల వేగంతో వెళుతూ అసభ్యప్రవర్తనకు పాల్పడ్డాడు దీపక్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం