Petrol Diesel Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు కారణాలు వెల్లడించిన పెట్రోలియం మంత్రి

|

Feb 21, 2021 | 9:12 PM

Petrol Diesel Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతుండడానికి గల కారణాలను కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివరించారు. ఇంటర్నేషనల్‌...

Petrol Diesel Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు కారణాలు వెల్లడించిన పెట్రోలియం మంత్రి
Follow us on

Petrol Diesel Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతుండడానికి గల కారణాలను కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివరించారు. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఇంధన ఉత్పత్తులు తగ్గాయని, మాన్యుఫ్యాక్చరింగ్‌ కంట్రీస్‌ ఎక్కువ లాభాల కోసం తక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని ఆయన అన్నారు. దీంతో ఇంధనాన్ని వినియోగించుకునే దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పెట్రోలియం ఉత్పత్తిని తగ్గించవద్దని పెట్రోలియం ఎగుమతి దేశాల ఆర్గనైజేషన్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలను కోరినట్లు వెల్లడించారు. పెట్రోలియం ఉత్పత్తిని తగ్గించడం వల్ల భారత దేశంపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.

కరోనా ఖర్చులు ధరల పెరుగుదలపై ప్రభావం:

కాగా, కరోనా మహమ్మారికి సంబంధించి ఖర్చుల ప్రభావం కూడా ధరల పెరుగుదలపై ఉందన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆదాయం సంపాదించాలన్న లక్ష్యంతో కేంద్ర సర్కార్‌, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంధన ధరలను పెంచుతున్నాయని అన్నారు.

ప్రతిపక్షాల మండిపాటు :

కోవిడ్‌-19 ప్రభావంతో పెట్రో ఉత్పత్తులకు డిమాండ్‌ పడిపోవడం వల్ల పెట్రోలియం ఉత్పత్తిని తగ్గించాలని చమురును ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని గత సంవత్సరం ఏప్రిల్‌లో మన దేశం సమర్ధించింది. ఇక వరుసగా 12 రోజుల పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు కేంద్ర సర్కార్‌పై మండిపడుతున్నారు. దీనిపై ఇటీవల ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పందిస్తూ ధరల పెరుగుదలకు రాష్ట్రాల బాధ్యత కూడా ఉందని తెలిపింది. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే నిందించడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌లపై వ్యాట్‌ పెంచుతున్నాయని పేర్కొంది.

Also Read: Chandrayaan-3: చంద్రయాన్‌-3 వాయిదా.. కీలక విషయాలు వెల్లడించిన ఇస్రో చైర్మన్‌ ‌.. ఈ ప్రయోగం ఎందుకంత కీలకం..!