Weather Update: దేశంలోని అనేక ప్రాంతాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు.. అక్కడ రాత్రి నుంచి భారీ వర్షాలు..!

|

Jun 17, 2022 | 8:00 AM

Weather Update: దేశ రాజధాని ఢిల్లీలో గత రాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలో తగ్గుదల నమోదైంది. ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (RWFC) రాబోయే రెండు..

Weather Update: దేశంలోని అనేక ప్రాంతాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు.. అక్కడ రాత్రి నుంచి భారీ వర్షాలు..!
Follow us on

Weather Update: దేశ రాజధాని ఢిల్లీలో గత రాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలో తగ్గుదల నమోదైంది. ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (RWFC) రాబోయే రెండు గంటలపాటు న్యూఢిల్లీ, NCRలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లోని అనేక ప్రాంతాల్లో రాబోయే 2 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో లోనీ దేహత్, హిండన్ AF స్టేషన్, బహదూర్‌ఘర్, ఘజియాబాద్, ఇందిరాపురం, ఛప్రౌలా, నోయిడా, దాద్రీ, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, బల్లాభ్‌ఘర్ ఉన్నాయి. శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఒక మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

ఒక రోజు ముందు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదివారం నాటికి, 36 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుందని అంచనా. జూన్ 22 తర్వాత వాతావరణం తేటతెల్లమై పొడి గాలులు వీస్తాయని, అయితే ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగే అవకాశం లేదని ఆ శాఖ తెలిపింది. రుతుపవనాలు సాధారణ తేదీ జూన్ 27 కంటే ఒకటి లేదా రెండు రోజుల ముందు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

జూన్ 29 వరకు హీట్ వేవ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. వాయువ్య భారతదేశం జూన్ 2 నుండి వేడి గాలులున్నాయి. IMD ప్రకారం.. జూన్ 3 నుండి ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలలో వేడి తరంగాల ప్రభావం ప్రారంభమైంది.

 


నైరుతి రుతుపవనాలు జూన్ 23, జూన్ 29 మధ్య భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పశ్చిమ హిమాలయ ప్రాంతాలు, దాని పరిసర ప్రాంతాలైన పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇది కాకుండా, రాబోయే ఐదు రోజుల్లో రాజస్థాన్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి