Tiranga Bike Rally: పౌరులలో దేశభక్తి, జాతీయతను నింపడమే లక్ష్యం.. ‘హర్‌ఘర్‌ తిరంగా’ బైక్‌ ర్యాలీలో కేంద్ర మంత్రులు..

| Edited By: TV9 Telugu

Aug 11, 2023 | 1:49 PM

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ నుంచి 'హర్ ఘర్ తిరంగా' బైక్ ర్యాలీని ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రగతి మైదాన్ నుంచి ప్రారంభమై ఇండియా గేట్ సర్కిల్ మీదుగా మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం వద్ద ముగిసింది. పౌరులలో దేశభక్తి, జాతీయతను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. ఇలా ప్రతిచోటా జాతీయ జెండా ఎగరేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, దేశ ప్రజలను కోరారు.

Tiranga Bike Rally: పౌరులలో దేశభక్తి, జాతీయతను నింపడమే లక్ష్యం.. ‘హర్‌ఘర్‌ తిరంగా’ బైక్‌ ర్యాలీలో కేంద్ర మంత్రులు..
Tiranga Bike Rally
Follow us on

ఢిల్లీలో ఎంపీల ‘హర్‌ఘర్‌ తిరంగా’ బైక్‌ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు వైస్‌ ప్రెసిడెంట్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌. హర్‌ఘర్ తిరంగా అభియాన్ 2.0లో భాగంగా శుక్రవారం న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ నుంచి ‘హర్ ఘర్ తిరంగా’ బైక్ ర్యాలీని ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రగతి మైదాన్ నుంచి ప్రారంభమై ఇండియా గేట్ సర్కిల్ మీదుగా మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, అనురాగ్‌ ఠాకూర్‌, శోభా కరంద్లాజే, మీనాక్షి లేఖి తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..15 ఆగస్టు నాడు దేశవ్యాప్తంగా అందరి ఇండ్లు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు.. ఇలా ప్రతిచోటా జాతీయ జెండా ఎగరేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, దేశ ప్రజలను కోరారు. తెలుగు ప్రజలు కూడా తమ తమ ప్రాంతాల్లో జరిగే ఇలాంటి ర్యాలీల్లో స్వచ్ఛందంగా భాగస్వామ్యులై.. జాతీయభావనను ప్రదర్శించాలని కిషన్ రెడ్డి కోరారు. స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న దేశ పౌరులు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి అన్నారు. రూ. 25తో జాతీయ జెండాను కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. పౌరులలో దేశభక్తి, జాతీయతను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. ప్రజల హృదయాలలో దేశభక్తి భావనను నింపడం, భారతదేశ ప్రయాణాన్ని, దేశానికిి గర్వకారణంగా నిలచిన వ్యక్తులను స్మరించుకోవడం ఈ ప్రచారం వెనుక ఉన్నప్రధాన ఆలోచన అని తెలిపారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (AKAM) ఆధ్వర్యంలో ఆగస్టు 13 నుండి 15 వరకు దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగ’ జరుపుకోనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపింది.  ఏకేఏఎం అనేది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల జ్ఞాపకార్థం కొనసాగుతున్న వేడుక. స్వాతంత్ర్య పోరాటం, ఈ దేశం సాధించిన మైలురాళ్లపై దృష్టి సారించడం ఈ ర్యాలీ ముఖ్య లక్ష్యం అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

గత సంవత్సరం, ఈ ప్రచారం అపారమైన విజయాన్ని సాధించింది, దీనిలో కోట్లాది గృహాలు భౌతికంగా తమ ఇళ్ల వద్ద ‘తిరంగ’ను ఎగురవేశారు మరియు ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్‌సైట్‌లో ఆరు కోట్ల మంది సెల్ఫీలను అప్‌లోడ్ చేసారు, ”అని పేర్కొంది.

పోస్టాఫీసుల ద్వారా 1.6 లక్షల జాతీయ జెండాల విక్రయం

భారత ప్రభుత్వం గత ఏడాది ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (AKAM) ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం 2022లో భారీ విజయాన్ని సాధించింది. ఇక్కడ 230 మిలియన్ల కుటుంబాలు భౌతికంగా తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 60 మిలియన్ల మంది HGT వెబ్‌సైట్‌లో సెల్ఫీలను అప్‌లోడ్ చేశారు. ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం, ఇండియా పోస్ట్ తన 1.6 లక్షల పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాలను విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం