విశాఖ హనీట్రాప్ గూఢచర్యం కేసు.. మరొకరికి అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ

| Edited By:

Sep 15, 2020 | 12:44 PM

2019 విశాఖపట్టణం హనీ ట్రాప్ గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తాజాగా మరొకరిని అరెస్ట్ చేసింది

విశాఖ హనీట్రాప్ గూఢచర్యం కేసు.. మరొకరికి అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ
Follow us on

visakhapatnam espionage case: 2019 విశాఖపట్టణం హనీ ట్రాప్ గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తాజాగా మరొకరిని అరెస్ట్ చేసింది.ఈ కేసులో నిన్న ఒకరిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ, ఇవాళ గిటేలి ఇమ్రాన్ అనే వ్యక్తిని గుజరాత్‌లో అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ ఐఎస్‌ఐ కోసం ఈ వ్యక్తి గూఢచర్యం చేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. అతడు విశాఖలోని నేవీ రహస్యాలను సేకరించేందుకు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ తెలిపింది.

అంతేకాదు విశాఖ నేవీ సిబ్బందికి భారీగా ముడుపులు అందజేసినట్లు విచారణలో వెల్లడైంది. అయితే ఈ కేసులో ఎన్‌ఐఏ ఇప్పటివరకు 11మంది నేవీ సిబ్బంది సహా 15 మంది అరెస్ట్ చేసింది. హవాలా మార్గాల్లో నేవీ సిబ్బందికి నిధులు సమకూర్చినట్టు ఇమ్రాన్‌ దర్యాప్తులో వెల్లడించినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.

అయితే పాకిస్తాన్‌కి చెందిన కొందరు గూఢచారులు జూనియర్ స్థాయి నేవీ అధికారులను ట్రాప్ చేయడానికి ప్రయత్నించారు. వారి నుంచి భారత నౌకలు, జలాంతర్గాముల లొకేషన్, ఇతర సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు. ఇందుకు అందమైన యువతులను ఎరవేసినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

Read More:

చిరు ‘అర్బన్ మాంక్‌’ లుక్.. మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసిన మెగాస్టార్

అప్పుడెప్పుడో ఆగిన చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటోన్న కీర్తి