UP: హోటల్‌లో ప్రేమికుడితో పట్టుబడిన వివాహిత.. భర్త నుంచి తప్పించుకునేందుకు సాహసమే చేసిందిగా..

గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న సంఘటలు చూస్తే.. భార్యాభర్తల బంధంలో దారుణంగా బీటలు పడుతున్నాయి. డబ్బుల కోసం శారీరక సుఖం కోసం ఇలా రకరకాల కారణాలతో భర్త లేదా భర్త వివాహేతర సంబంధాలను నేరుపుతున్నారు. ఏకంగా హత్యలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఓ భర్త తన ప్రియుడితో హోటల్ లో ఉన్న సమయంలో భర్త రాకచూసి షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

UP: హోటల్‌లో ప్రేమికుడితో పట్టుబడిన వివాహిత.. భర్త నుంచి తప్పించుకునేందుకు సాహసమే చేసిందిగా..
Married Woman Caught With Lover

Updated on: Jun 19, 2025 | 12:57 PM

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఒక మహిళ పెఎత్తైన గోడపై నుంచి దూకుతున్న షాకింగ్ సంఘటన కెమెరాలో రికార్డైంది. మహిళ ఇలా గోడ దుముకుతున్న సంఘటన కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త, ఆమె అత్తమామల నుంచి తప్పించుకోవడానికి .. తనని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండడానికి ముఖంపై గుడ్డ కప్పుకున్న మహిళ గోడపై నుంచి దూకుతున్నట్లు వీడియోలో చూడవచ్చు.

బడౌత్‌ పట్టణంలో ఒక మహిళ తన ప్రియుడి శోభిత్ తో కలిసి ఒక హోటల్‌ గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ప్రియుడితో ఉన్న సమయంలో భర్త హోటల్ వద్దకు రావడంతో గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే కోడలు చేస్తున్న పనిని అత్తమామలు తమ సెల్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేశారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

శోభిత తన ప్రేమికుడితో కలిసి బడౌత్‌ లోని ఓయో హోటల్‌లో ఉంటోంది. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న ఆమె అత్తమామలు ఆమె భర్త .. పోలీసులతో కలిసి హోటల్‌కు చేరుకున్నారు. ప్రియుడు శోభిత్‌ను పోలీసులు పట్టుకున్నారు. విచారిస్తున్నట్లు బడౌత్‌ ఎస్‌హెచ్‌వో మనోజ్‌కుమార్‌ చాహల్‌ తెలిపారు.

ఈ ఘటన సోమవారం జరగ్గా.. తన భార్య.. అతని ప్రియుడి నుంచి తన ప్రాణాలకు హాని ఉందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. తనకు వీరిద్దరి నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నాడు. ఈ మహిళకు 2019లో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే దంపతుల మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఆ మహిళకు ఎస్పీ కార్యాలయంలోని మహిళా విభాగంలో వైవాహిక కౌన్సెలింగు నడుస్తోంది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..