Zika virus cases: యూపీలో మరో 16 మందికి జికా వైరస్ .. 105 చేరిన కేసుల సంఖ్య..

|

Nov 10, 2021 | 10:51 PM

ఉత్తరప్రదేశ్‎లో జికా వైరస్ విజృంభిస్తోంది. కాన్పూర్ జిల్లాలో కొత్తగా 16 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. కాన్పూర్‌లో ఇప్పటివరకు జికా వైరస్‌తో బాధపడుతున్న సంఖ్య105కు పెరిగింది....

Zika virus cases: యూపీలో మరో 16 మందికి జికా వైరస్ .. 105 చేరిన కేసుల సంఖ్య..
Zeaka
Follow us on

ఉత్తరప్రదేశ్‎లో జికా వైరస్ విజృంభిస్తోంది. కాన్పూర్ జిల్లాలో కొత్తగా 16 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. కాన్పూర్‌లో ఇప్పటివరకు జికా వైరస్‌తో బాధపడుతున్న సంఖ్య105కు పెరిగింది. 16 మంది కొత్త రోగులలో ఇద్దరు గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. పెరుగుతున్న జికా వైరస్ కేసుల దృష్ట్యా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈరోజు కాన్పూర్‌లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జికా వైరస్ కట్టడికి చేసిన ప్రయత్నాల గురించి ఆరా తీశారు. వైరస్‌కు సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయని యోగి తెలిపారు. త్వరలో కాన్పూర్ జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ నుండి విముక్తి పొందుతుందని చెప్పారు.

పెరుగుతున్న జికా వైరస్ కేసులపై భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి, ఫాగింగ్, నమూనాల పరీక్ష వంటి పనులను పూర్తి అంకితభావంతో చేయాలని అధికారులకు సూచించారు. ఎవరికైనా వ్యాధి సోకినా లేదా లక్షణాలు కనిపిస్తే వారిని వేరుచేయాలని చెప్పారు. దోమలతో పాటు లార్వాలను కూడా నాశనం చేయాలన్నారు. దీని కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని యోగి స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతంలో అవసరమైన చర్యలు తీసుకున్నామని, డ్రైవ్‌ల ద్వారా కేసుల సంఖ్యను తగ్గించడంతో పాటు రెగ్యులర్ శానిటైజేషన్ చేస్తున్నామని కృష్ణా నగర్ పిహెచ్‌సి ఇన్‌చార్జి మాధ్వి సింగ్ చెప్పారు.

ముఖ్యంగా, కాన్పూర్‌లోని శ్యామ్ నగర్ ప్రాంతంలో దోమలు, పరిశుభ్రత గురించి ఫిర్యాదులు పెద్ద ఆందోళనగా కలిగిస్తున్నాయి. సీఎం రాకతోనే స్థానిక యంత్రాంగం పరిశుభ్రతపై చర్యలు తీసుకుందని 50 ఏళ్ల కుసుమ్ లతా యాదవ్ అన్నారు. జికా వైరస్ వ్యాప్తి చెందడానికి దోమలు కారణమని ఆమె చెప్పారు.

Read Also.. Gold Smuggling: శానిటరీ న్యాప్కిన్స్‌లో దాచి బంగారం రవాణా.. తనిఖీల్లో దొరికిపోయిన ఎయిర్‌ హోస్టెస్‌