Nitin Gadkari: ఇంధనానికి ప్రత్యామ్నాయం అన్వేషించాలి.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

|

Apr 13, 2022 | 7:44 AM

దేశంలో ఇంధన ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెట్రోల్(Petrol), డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న ధరలను....

Nitin Gadkari: ఇంధనానికి ప్రత్యామ్నాయం అన్వేషించాలి.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
Nitin Gadkari
Follow us on

దేశంలో ఇంధన ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెట్రోల్(Petrol), డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న ధరలను నియంత్రించాల్సిన అధికారులు, నేతలు ప్రత్యామ్నాయ సూచనలు చూసుకోవాలని చెబుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పలు వ్యాఖ్యలు చేశారు. ఇంధన(Fuel) ధరలు పెరిగిపోతుండటంతో వాటికి ప్రత్యామ్నాయంగా మిథనాల్ ను వినియోగించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో.. చౌక ధరకు లభ్యమయ్యే ఇంధనాన్ని అన్వేషించడం చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. మిథనాలు చాలా చవకైనదని వాటర్‌వేస్ కాన్క్లేవ్-2022 ముగింపు రోజున జరిగిన ప్రసంగంలో మాట్లాడారు. అస్సాం రాష్ట్రం రోజుకు వంద టన్నుల మిథనాల్‌ను ఉత్పత్తి చేస్తోందన్న కేంద్ర మంత్రి.. దానిని 500 టన్నులకు పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

” ప్రస్తుతం డీజిల్ తో నడుస్తున్న వాటిని మిథనాల్ తో పని చేసే విధంగా మార్చవచ్చు. ఈ సాంకేతికతను స్వీడిష్ కంపెనీ కలిగి ఉంది. మిథనాల్ వాడకం ఇంధన ధరను 50 శాతం తగ్గిస్తుంది. దీనిపై దృష్టి సారించాలని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాను. జలమార్గాలను ఎక్కువగా ఉపయోగించాలి. రవాణాకు జలమార్గాన్ని వినియోగించాలి. రోడ్డు మార్గంలో రవాణా ఖర్చు ₹10 అయితే, రైల్వేల ద్వారా అది ₹6 అని, జలమార్గాల ద్వారా మాత్రమే రూ.1కి తగ్గుతుంది. ప్రస్తుత రవాణా వ్యయం ఎక్కువగా ఉంది. దీనిని 8-10 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉంది.”

                             – నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి

Also Read

Dawood Ibrahim: దావూద్‌కు సోదరుడికి ఝలక్.. పలు ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ..

IPL 2022: 4 సార్లు ఓడినా.. ఛాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేన.. చెన్నైలా ముంబై విజయాల ఖాతా తెరిచేనా?

US SHOOTING: న్యూయార్క్ నగరంలో బాంబులు, తుపాకీ కాల్పులతో విధ్వంసం.. 13మంది మృతి, పదుల సంఖ్యలో క్షతగాత్రులు