ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి.. అప్రమత్తమైన సెక్యూరిటీ..

|

Apr 25, 2024 | 6:01 PM

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. సభలో ప్రసంగిస్తుండగా ఉన్నట్లుండి పడిపోయారు. దేశంలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 370 సీట్లు గెలవాలన్న దృఢనిశ్చయంతో ఉంది కమలం పార్టీ. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలోని పుసాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి.. అప్రమత్తమైన సెక్యూరిటీ..
Nitin Gadkari
Follow us on

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. సభలో ప్రసంగిస్తుండగా ఉన్నట్లుండి పడిపోయారు. దేశంలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 370 సీట్లు గెలవాలన్న దృఢనిశ్చయంతో ఉంది కమలం పార్టీ. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలోని పుసాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ప్రస్తుతం 66 ఏళ్ల వయసు ఉన్న ఆయన వేసవి తాపం అధికంగా ఉండటంతో తట్టుకోలేక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ బుధవారం స్పృహతప్పి పడిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నితిన్ గడ్కరీ దాదాపు పడిపోయినట్లు చూపిస్తుంది. ఈక్రమంలోనే వేదిక చుట్టూ ఉన్న అతని సహాయకులు సహాయం చేశారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పక్కకు తీసుకెళ్లి విశ్రాంతి కల్పించారు. మంచినీళ్లు, ఎనర్జీ డ్రింక్స్ అందజేసి శక్తి పుంజుకునేందుకు సహాయపడ్డారు.

కొంత సేపు విశ్రాంతి తర్వాత గడ్కరీ తిరిగి కోలుకున్నారు. వెంటనే వేదికపైకి తిరిగి వచ్చారు. ఇదిలా ఉంటే బుధవారం పూసాద్‌లో 39 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ సభ అనంతరం తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎవరూ చింతించనవసరం లేదని పేర్కొన్నారు. తరువాత మరో ఎన్నికల ప్రచార సభలో, ర్యాలీలో పాల్గొన్నారు. యవత్మాల్-వాషిం లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న షిండే వర్గంలోని శివసేన అభ్యర్థి రాజశ్రీ హేమంత్ పాటిల్ తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ తన ఎక్స్ ఖాతాలో ఈ సందేశాన్ని జోడించారు. “మహారాష్ట్రలోని పూసాద్‌లో ర్యాలీ సందర్భంగా వేడి కారణంగా నేను అసౌకర్యానికి గురయ్యాను. కానీ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను తదుపరి సమావేశానికి హాజరయ్యేందుకు వరుద్‌కు బయలుదేరాను. మీ ప్రేమ, ఆదరణలకు ధన్యవాదాలు” అని కేంద్ర మంత్రి ట్వీట్‌లో తెలిపారు. ఏప్రిల్ 26న శుక్రవారం రెండవ విడత పోలింగ్ జరుగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..