UK Strain Virus: ఆ రాష్ట్రంలో యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ గుర్తింపు.. వెల్లడించిన ఆరోగ్యశాఖ మంత్రి

|

May 13, 2021 | 6:04 AM

UK Strain Virus: భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు రికార్టు స్థాయిలో పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది...

UK Strain Virus: ఆ రాష్ట్రంలో యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ గుర్తింపు.. వెల్లడించిన ఆరోగ్యశాఖ మంత్రి
Uk Strain Virus
Follow us on

UK Strain Virus: భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు రికార్టు స్థాయిలో పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక భారత్‌లో యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ వెలుగు చూస్తుండటంతో కేసులు తీవ్రతరం అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా రాజస్థాన్‌లో యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం రాజస్థాన్ నుంచి వచ్చిన శాంపిల్స్‌లో ఈ స్ట్రెయిన్ ఉందని చెబుతోంది. ఈ విషయాన్ని రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి రఘు శర్మ వెల్లడించారు. దీనికి సంబంధించిన రిపోర్టులు ఇటీవలే తమకు అందాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సూచనల మేరకు జైపూర్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే పనిని ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడికి చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో కూడా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది.

ఇవీ కూడా చదవండి

Telangana Corona Cases: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా వ్యాప్తి.. క్రమంగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు..

India Corona: భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. రికార్డు స్థాయికి చేరిన మరణాల సంఖ్య..!