గుడ్‌న్యూస్‌.. 5 నిమిషాల ముందు కూడా రైల్వే టికెట్‌ బుకింగ్, క్యాన్సిల్‌

| Edited By:

Oct 09, 2020 | 5:18 PM

రైల్వే ప్రయాణికులు భారత రైల్వే శాఖ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. నిర్దేశిత స్టేషన్ నుంచి రైలు బయల్దేరే సమయానికి 5 నిమిషాల ముందు బుక్ చేసుకున్నా సీట్లు లభిస్తాయని తెలిపింది

గుడ్‌న్యూస్‌.. 5 నిమిషాల ముందు కూడా రైల్వే టికెట్‌ బుకింగ్, క్యాన్సిల్‌
Follow us on

Indian Railway News: రైల్వే ప్రయాణికులు భారత రైల్వే శాఖ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. నిర్దేశిత స్టేషన్ నుంచి రైలు బయల్దేరే సమయానికి 5 నిమిషాల ముందు బుక్ చేసుకున్నా సీట్లు లభిస్తాయని తెలిపింది. రైలు బయల్దేరే 30 నుంచి 5 నిమిషాల ముందు కూడా సెకండ్ రిజర్వేషన్ చార్ట్ అందుబాటులో ఉంచుతామని రైల్వే శాఖ తెలిపింది. అంతేకాదు ఆ సమయంలో టికెట్‌ క్యాన్సిల్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చునని.. రేపటి నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని వివరించింది.

కాగా కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోగా.. ప్రజా రవాణాను పూర్తిగా నడిపేందుకు ఇప్పుడు కేంద్రం ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికుల కోసం భారత రైల్వే పలు నిర్ణయాలు తీసుకుంటోంది. అంతకుముందు రైలు ప్రయాణించే సమయం 2 గంటల ముందు ఫైనల్‌ ఛార్ట్‌ని తయారు చేసేవారు. కానీ ఇప్పుడు రైలు బయల్దేరే సమయానికి 4 గంటల ముందు మొదటి రిజర్వేషన్ ఛార్ట్‌ తయారు చేస్తారు. ఆ తరువాత ఎవరైనా సీట్లను క్యాన్సిల్ చేసుకుంటే వాటిని పీఆర్‌ఎస్‌ కౌంటర్ల ద్వారా రెండో చార్ట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ కొత్త రూల్‌ అన్ని భారత రైల్వేస్‌ నడుపుతున్న ప్రతి ప్రత్యేక రైలుకు వర్తించనుంది. అంతేకాదు ఈ నెల 17న ప్రారంభం కాబోతున్న తేజస్ ఎక్స్‌ప్రెస్‌లోనూ ఈ రూల్ వర్తించనుంది.‌

Read More:

ఆచారాలను భ్రష్టు పట్టించావు.. ‘గే’ పెళ్లిపై కుల పెద్దల ఆగ్రహం

ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలన్నింటిలో ఆరోగ్యమిత్రలను నియమించాలి