Rafale Fighter Jets: ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు బయలుదేరిన మరో మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు

|

Mar 31, 2021 | 5:44 PM

Rafale Fighter Jets: మరో మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు బుధవారం భారత్‌కు చేరుకోనున్నాయి. మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు తీసుకువచ్చేందుకు భారత్ వైమానిక బృందం...

Rafale Fighter Jets: ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు బయలుదేరిన మరో మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు
Rafale Fighter Jets
Follow us on

Rafale Fighter Jets: మరో మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు బుధవారం ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు బయలేదేరాయి. మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు తీసుకువచ్చేందుకు భారత్ వైమానిక బృందం ఇటీవల ఫ్రాన్స్‌ చేరుకుంది. అయితే ఫైటర్‌ జెట్లు ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఫ్రాన్స్‌ నుంచి నేరుగా గుజరాత్‌కు చేరుకోనున్నాయి. మధ్యలో యూఏఈలో ఇంధనం నింపుకోనున్నాయి. భారత్‌ 2016 సెప్టెంబర్‌లో ఫ్రెంచ్‌ ప్రభుత్వంతో రూ.59వేల కోట్లతో 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో ఫ్రెంచ్‌ కంపెనీ డసాల్డ్‌ ఏవియేషన్‌ ఐదు యుద్ద విమానాలను సరఫరా చేయగా, గత ఏడాది జూలై 28న దేశానికి చేరుకున్నాయి.

ఇప్పటి వరకు 11 యుద్ద విమానాలు భారత్‌కు చేరగా, వాటిని భారత్‌ వైమానిక దళం గోల్డెన్‌ ఆరోస్‌ స్వ్కాడ్రన్‌లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాఫెల్‌ యుద్ధ విమానాలను లడఖ్‌ సరిహద్దులో మోహరించారు. వీటి రాకతో గోల్డెన్‌ ఆరోస్‌ స్క్వాడ్రన్‌ బలం 14క చేరుకోనుండగా, భారత వైమానిక దళం మరింత పటిష్టం కానుందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. మరో ఐదు యుద్ద విమానాలు ఏప్రిల్‌ చివరి వరకు భారత్‌కు అప్పగించనున్నట్లు ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ పేర్కొన్నారు.

 

ఇవీ చదవండి: New Wage Code Deferred: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త వేతన చట్టం తాత్కాలికంగా నిలిపివేత.. యధావిధిగా శాలరీ అందజేత

ముంబై మాజీ పోలీసు కమిషనర్‌కు బాంబే హైకోర్టు షాక్… ఎఫ్‌ఐఆర్‌ లేకుండా దర్యాప్తునకు ఆదేశించలేమన్న కోర్టు