Indian Railways: కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్‌ రైల్వే.. ఆ సర్వీసులన్నీ ఒకే గొడుగు కిందకు..

|

Feb 11, 2022 | 7:14 PM

Indian Railways: భారత రైల్వేకు చెందిన పలు సేవలను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేకు చెందిన పలు సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పలు సేవలను విలీనం చేస్తూ...

Indian Railways: కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్‌ రైల్వే.. ఆ సర్వీసులన్నీ ఒకే గొడుగు కిందకు..
Summer Holiday Special Trains
Image Credit source: TV9 Telugu
Follow us on

Indian Railways: భారత రైల్వేకు చెందిన పలు సేవలను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేకు చెందిన పలు సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పలు సేవలను విలీనం చేస్తూ ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ (IRMS) కేడర్‌ను రూపొందించింది. రైల్వేకు చెందిన మొత్తం 8 సేవలను ఒక కేడర్‌గా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కేంద్రం రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ అధికారికంగా ప్రకటించారు. అయితే సేవలను విలీనం చేయడం వల్ల అధికారుల సీనియారిటీపై ఎలాంటి ప్రభావం చూపదని భారతీయ రైల్వే స్పష్టం చేసింది.

ఇండియన్‌ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో పనులు మరింత వేగంగా, వేగవంతంగా సాగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం రైల్వే భిన్నమైన కేడర్లతో నడుస్తోంది అయితే వీటంన్నికీ ఒకే దానికి కిందకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా జనరల్ మేనేజర్‌కు చెందిన 27 పోస్టులను అప్‌గ్రేడ్ చేసి, అప్పర్ గ్రేడ్ ఇచ్చారు. అలాగే అర్హులైన అధికారులకు జనరల్ మేనేజర్‌లో టాప్ గ్రేడ్ పోస్టును ఇచ్చింది. 2019లోనే కేంద్రం ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసింది. ప్రధాని అధ్యక్షతన నిర్వహించిన కేబినేట్‌ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఇక విలీనం కానున్న సర్వీసుల ఏంటంటే.. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు(ఐఆర్టీఎస్), ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్(ఐఆర్ఏఎస్), ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్(ఐఆర్ఎస్ఈ), ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్(ఐఆర్ఎస్ఎస్), ఇండియన్ రైల్వే సర్వీసు ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్(ఐఆర్ఎస్ఎస్ఈ), ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్(ఐఆర్ఎస్ఈఈ), ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసు(ఐఆర్‌పీఎస్).

Also Read: IPL Highest Paid Players: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన 5గురు ప్లేయర్లు.. లిస్టులో ఇద్దరు భారతీయులు.. 2022లో ఎవరో?

CM KCR: ‘జాగ్రత్త నరేంద్ర మోడీ.. ఇక్కడ తెలంగాణ పులిబిడ్డ’ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

NTA SWAYAM July 2021: స్వయం జూలై 2021 అడ్మిట్ కార్డులు విడుదల.. 300 ఆన్‌లైన్‌ కోర్సుల్లో..