CM KCR: ‘జాగ్రత్త నరేంద్ర మోడీ.. ఇక్కడ తెలంగాణ పులిబిడ్డ’ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

CM KCR Speech : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్రం ఏం ఇవ్వకున్నా ఉన్నవాటితో సరిపెట్టుకున్నామని ఆయన అన్నారు.

CM KCR: 'జాగ్రత్త నరేంద్ర మోడీ.. ఇక్కడ తెలంగాణ పులిబిడ్డ' సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Modi

|

Feb 11, 2022 | 8:46 PM

CM KCR Speech Live: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్రం ఏం ఇవ్వకున్నా ఉన్నవాటితో సరిపెట్టుకున్నామని ఆయన అన్నారు. 8 ఏళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా ఎదిగామన్న సీఎం కేసీఆర్.. దేశంలో అనేక రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని చెప్పారు. కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, రైల్వే జోన్, రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదాను ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేంద్రం సమస్యలు సృష్టించేందుకు చూస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు.

టీఆర్ఎస్ పోరాటం చేసిన పార్టీ అని.. యుద్ధం చేసి గెలిచిన పార్టీ అని పేర్కొన్న ఆయన.. కేంద్రానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని తెలంగాణ పులిబిడ్డగా అవసరమైతే ఢిల్లీ కోటను బద్దలు కొట్టేందుకు కూడా సిద్దమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జనగామ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అలాగే జనగామ జిల్లాకు వరాలు కురిపించారు. జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా.. స్టేషన్ ఘనపురం, పాలకుర్తిలలో డిగ్రీ కాలేజీలు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 11 Feb 2022 05:18 PM (IST)

  సీఎం కేసీఆర్ స్పీచ్ పాయింట్స్..

  టీఆర్ఎస్ యుద్ధం చేసిన పార్టీ.. పోరాటం చేసిన పార్టీ అని చెప్పిన సీఎం కేసీఆర్.. బీజేపీ పార్టీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ కోటను బద్దలు కొట్టేందుకు కూడా సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు. జాగ్రత్త నరేంద్ర మోడీ.. తెలంగాణ పులిబిడ్డ ఇక్కడ భయపడేవాడు ఎవరూ లేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మా శక్తి ముందు మీరు అడ్రస్ కూడా ఉండరు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

 • 11 Feb 2022 05:14 PM (IST)

  సీఎం కేసీఆర్ స్పీచ్ పాయింట్స్..

  అడ్డగోలుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా అభివృద్ధి చేసుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. బ్యాంకులను మోసం చేసినవారిని విదేశాలకు పంపిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక్కడ పేదరైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలంటారు. ప్రాణం పోయినా కూడా మీటర్లు పెట్టం అని తెగేసిచెప్పేశాం. దేశంలో అనేక రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని చెప్పారు.

 • 11 Feb 2022 05:11 PM (IST)

  సీఎం కేసీఆర్ స్పీచ్ పాయింట్స్..

  తెలంగాణకు కేంద్రం ఏ సహాయం చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం సమస్యలు సృష్టించాలని చూస్తోంది. కరెంట్ సంస్కరణ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ పంచాయితీ చేస్తున్నారని మండిపడ్డారు.

 • 11 Feb 2022 05:05 PM (IST)

  సీఎం కేసీఆర్ స్పీచ్ పాయింట్స్..

  కేంద్రం కొన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. గత 8 ఏళ్లలో ఏనాడూ కేంద్రంతో గొడవ పెట్టుకోలేదని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. నిధులు ఇవ్వకున్నా కడుపుకట్టుకొని పనిచేశామని అన్నారు. కరెంట్ సంస్కరణ పేరుతో ప్రధాని మోడీ పంచాయితీ చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

 • 11 Feb 2022 05:03 PM (IST)

  సీఎం కేసీఆర్ స్పీచ్ పాయింట్స్

  దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్నామని సీఎం అన్నారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు ఇచ్చినట్లుగా చెప్పారు. మార్చి తర్వాత ప్రతీ నియోజకవర్గంలో 2 వేల కుటుంబాలకు దళిత బంధు ఇచ్చాం.

 • 11 Feb 2022 05:02 PM (IST)

  సీఎం కేసీఆర్ స్పీచ్ పాయింట్స్

  రాష్ట్రంలో తాగునీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. గోదావరి నీళ్ళతో జనగామ పాదాలు కడిగేందుకు రంగం సిద్దం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

 • 11 Feb 2022 04:58 PM (IST)

  సీఎం కేసీఆర్ స్పీచ్ మెయిన్ పాయింట్స్..

  1.కరెంట్, మంచినీటి ఇబ్బందులు లేవు

  2.జనగామ జిల్లా ప్రజలు, అధికారులకు అభినందనలు

  3.గతంలో జనగామ ప్రాంతాన్ని చూస్తే కళ్లల్లో నీళ్లు వచ్చేవి

  4.ఘనపురం, పాలకుర్తికి డిగ్రీ కాలేజీ మంజూరు

  5. జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు

 • 11 Feb 2022 04:57 PM (IST)

  సీఎం కేసీఆర్ స్పీచ్ మెయిన్ పాయింట్స్..

  1.ప్రాణం పోయేవరకు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం

  2. బచ్చన్నపేటలో బ్రతుకులు బాగుపడుతున్నాయి

  3.ఎన్నడూ పండనటువంటి పంటలు పండుతున్నాయి

Published On - Feb 11,2022 4:52 PM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu