Watch: అమ్మో.. సారు కొట్టుడు మాములుగా లేదుగా.. విద్యార్థులను మరో రేంజ్‌లో చితకబాదిన టీచర్..

Tamilnadu Teacher: తమిళనాడులో ఓ టీచర్‌ వీరంగం సృష్టించాడు. ఓ విద్యార్థిని చితకబాదాడు. రెండ్రోజులు స్కూల్‌కు రాలేదన్న కోపంతో తన ప్రతాపం చూపించాడు. చిదంబరంలోని బాలుర ప్రభుత్వ పాఠశాలలో

Watch: అమ్మో.. సారు కొట్టుడు మాములుగా లేదుగా.. విద్యార్థులను మరో రేంజ్‌లో చితకబాదిన టీచర్..
Teacher Beating Students

Edited By:

Updated on: Oct 16, 2021 | 3:13 PM

ఓ టీచర్‌ ఇలా రెచ్చిపోయాడు. తన ఇంటి కోపమో.. పరాయి కోపమో తెలియదు కాని.. విద్యార్థిపై ఇలా తీర్చుకున్నాడు. అట్లా ఇట్లా కాదు.. ఇష్టమొచ్చినట్టుగా ఒంటిపై చితక బాదాడు. రక్తం వచ్చేట్టుగా కొట్టాడు. వద్దూ వద్దూ అంటూ కేకలు వేస్తున్నా కనికరించలేదు. అదే పనిగా బెత్తంతో చావ బాదాడు.తమిళనాడులో ఓ టీచర్‌ వీరంగం సృష్టించాడు. ఓ విద్యార్థిని చితకబాదాడు. రెండ్రోజులు స్కూల్‌కు రాలేదన్న కోపంతో తన ప్రతాపం చూపించాడు. చిదంబరంలోని బాలుర ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి.. రెండ్రోజుల పాటు స్కూల్‌కి రాలేదు. దీంతో అతనిపై సీరియస్‌ అయ్యాడు టీచర్‌.

అంతేకాదు.. క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల ముందే కాలుతో తన్ని చితకబాదాడు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు విద్యార్థి సంఘాలు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: జీవితంలో ఈ మూడింటిని వదిలేస్తే.. ధన లక్ష్మి మీ ఇంటి తలుపులు తడుతుంది..

Extra Marital Affair: అనుమానించిన అమ్మ.. 800 కిలోమీటర్లు వెంబడించి తండ్రిని అడ్డంగా బుక్ చేసిన కొడుకు..