National Task Force: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఆక్సిజన్ పంపిణీని పర్యవేక్షించేందుకు నేషనల్ టాస్క్‌ఫోర్స్ నియామకం

|

May 08, 2021 | 6:42 PM

Supreme Court on Oxygen Distribution: కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో ఆసుపత్రుల్లో

National Task Force: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఆక్సిజన్ పంపిణీని పర్యవేక్షించేందుకు నేషనల్ టాస్క్‌ఫోర్స్ నియామకం
Follow us on

Supreme Court on Oxygen Distribution: కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో చాలామంది మరణిస్తున్నారు. దేశంలో ఎక్కడ చూసినా ఆక్సిజన్ సమస్యే వేధిస్తోంది. ఈ క్రమంలో శనివారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ల‌భ్య‌త‌, పంపిణీని ప‌ర్య‌వేక్షించ‌డానికి ధర్మాసనం.. 12 మంది స‌భ్యుల‌తో నేష‌న‌ల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు శాస్త్రీయంగా, హేతుబ‌ద్ధంగా, స‌మానంగా ఆక్సిజ‌న్ అందేలా చూడ‌టం ఈ టాస్క్‌ఫోర్స్ బాధ‌త్య‌ అని పేర్కొంది. కొవిడ్-19 చికిత్స‌కు అవ‌స‌ర‌మైన మందుల విష‌యంలోనూ ఈ టాస్క్‌ఫోర్స్ ముందుండి పర్యవేక్షించాలని సూచించింది. దేశంలో కోవిడ్ పరిస్థితులు, ఆక్సిజన్, ఔషధాల కొరతపై శనివారం విచారించిన సుప్రీం కోర్టు.. వివిధ రాష్ట్రాల‌కు కేంద్రం చేస్తున్న ఆక్సిజ‌న్ కేటాయింపుల‌ను స‌మీక్షించాల‌ని ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

అంబులెన్సులు, కొవిడ్ కేర్‌లల్లో స‌దుపాయాలు లేక‌పోవ‌డం, హోమ్ క్వారంటైన్‌లో ఉన్న పేషెంట్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డంలో కేంద్రం విఫ‌ల‌మైంద‌ని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయ‌ప‌డింది. ఈ టాస్క్‌ఫోర్స్‌కు వెస్ట్ బెంగాల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వీసీ డాక్ట‌ర్ భ‌బాతోష్ బిశ్వాస్ నేతృత్వం వ‌హించ‌నుండగా.. మరో 11 మంది సభ్యులుగా ఉండనున్నారు. వీరంతా ఆక్సిజన్, కోవిడ్ పరిస్థితులు, మెడికల్ తదితర అంశాలను క్షణ్ణంగా పరిశీలించనున్నారు. అనంతరం ధర్మాసనానికి నివేదికను సమర్పించనున్నారు.

Also Read:

నెలకు 85 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇవ్వండి, ప్రజలందరికీ 3 నెలల్లో వ్యాక్సినేషన్ చేస్తాం , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Bill Gates: మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్ గేట్స్ ప్రతీ ఏటా మాజీ గ‌ర్ల్ ఫ్రెండ్‌తో టూర్‌… ( వీడియో )