విమాన ఛార్జీల నియంత్రణపై సుప్రీంకోర్టు సీరియస్.. కేంద్రానికి కీలక ఆదేశాలు!

పండుగలు, రద్దీ సమయాల్లో విమాన టికెట్ల ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్య ప్రయాణికులకు ఊరట కల్పించేలా సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. విమాన ఛార్జీలను నియంత్రించేందుకు రూపొందించిన నిబంధనల కాపీని రెండు వారాల్లోగా తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. కేంద్రం సమర్పించబోయే నిబంధనలు సామాన్య ప్రయాణికులకు ఎంతవరకు మేలు చేస్తాయో ఆ రోజు తేలనుంది.

విమాన ఛార్జీల నియంత్రణపై సుప్రీంకోర్టు సీరియస్.. కేంద్రానికి కీలక ఆదేశాలు!
Supreme Court On Airfare

Edited By:

Updated on: Jul 13, 2026 | 8:46 PM

పండుగలు, రద్దీ సమయాల్లో విమాన టికెట్ల ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్య ప్రయాణికులకు ఊరట కల్పించేలా సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. విమాన ఛార్జీలను నియంత్రించేందుకు రూపొందించిన నిబంధనల కాపీని రెండు వారాల్లోగా తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. కేంద్రం సమర్పించబోయే నిబంధనలు సామాన్య ప్రయాణికులకు ఎంతవరకు మేలు చేస్తాయో ఆ రోజు తేలనుంది.

విమాన టికెట్ ధరలలో అనియంత్రిత హెచ్చుతగ్గులపై సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విమాన ఛార్జీలు, బ్యాగేజీ వంటి అనుబంధ ఛార్జీలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సంయుక్తంగా ఒక సమగ్ర నియంత్రణా వ్యవస్థను రూపొందించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. విమాన సంస్థలు ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా సర్జ్ ప్రైసింగ్‌పై గరిష్ట పరిమితి విధించాలని, లగేజీ, సీట్ సెలెక్షన్ వంటి అనుబంధ సేవల ఛార్జీలను నియంత్రించాలని టికెట్ రద్దు, రీఫండ్‌లకు సంబంధించి అన్ని విమాన సంస్థలకు ఒకే రకమైన నిబంధనలు ఉండాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరుతున్నారు

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినా సరే.. కోర్టుకు ఇవ్వాల్సిందే !

విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది స్పందిస్తూ విమాన ఛార్జీల నియంత్రణకు సంబంధించిన నిబంధనలు ఇప్పటికే ఖరారు చేశామని, వాటిని పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. అయితే, పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ రెండు వారాల్లోగా ఆ నిబంధనల కాపీని ఖచ్చితంగా కోర్టు ముందు ఉంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us