Viral: అయ్యో ఈ చిట్టి గుండెకు ఏమైంది.. పెళ్లిలో భార్యతో కలిసి డాన్స్ చేస్తూ అనంతలోకాలకు.. వీడియో చూస్తే..

ఈ గుండెకు ఏమైంది.. ఎందుకు అకస్మాత్తుగా ఆగిపోతుంది.. నవ్వుతూ మన మధ్య గడిపిన వారే గుండెపోటుతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. నడుస్తూ.. ఆడుతూ.. డ్యాన్స్ చేస్తూ ఇలా చాలామంది అకస్మాత్తుగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలా ఆకస్మిక గుండెపోటు మరణాలు కలవర పరుస్తున్నాయి.

Viral: అయ్యో ఈ చిట్టి గుండెకు ఏమైంది.. పెళ్లిలో భార్యతో కలిసి డాన్స్ చేస్తూ అనంతలోకాలకు.. వీడియో చూస్తే..
Indore Man Collapses While Dancing at Wedding

Updated on: Feb 19, 2026 | 11:29 AM

ఈ గుండెకు ఏమైంది.. ఎందుకు అకస్మాత్తుగా ఆగిపోతుంది.. నవ్వుతూ మన మధ్య గడిపిన వారే గుండెపోటుతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. నడుస్తూ.. ఆడుతూ.. డ్యాన్స్ చేస్తూ ఇలా చాలామంది అకస్మాత్తుగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలా ఆకస్మిక గుండెపోటు మరణాలు కలవర పరుస్తున్నాయి. సడెన్‌గా అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణాలు కోల్పోతుండటం అందర్నీ వణికిస్తోంది.. ఇంకా ఆయా కుటుంబాలను శోకసంద్రంలో ముంచుతోంది.. ఖమ్మం జిల్లాకు చెందిన సాయి చంద్ర హైదరాబాద్‌లో మెడికల్ షాపునకు వెళ్లి ట్యాబ్లెట్ అడిగే లోపే గుండెపోటుతో చనిపోయాడు.. ఈ ఘటన మరువకముందే.. మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి వేడుకల్లో భాగంగా మెహందీ ఫంక్షన్‌లో తన భార్యతో డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలిపోయాడు. మొదట తూలి పడిపోయాడని అనుకున్నారు అంతా.. కానీ ఎంతకీ లేవకపోవడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.. కానీ వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందారని చెప్పారు.. దీంతో అప్పటి వరకూ ఎంతో సంతోషంగా కళకళలాడుతోన్న ఆ ఇంట విషాదం నెలకుంది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలోని ఓజ్రా గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన పెళ్లి వేడుక.. అకస్మాత్తుగా శోకసంద్రంగా మారింది. తన మేనల్లుడి వివాహంలో మెహందీ వేడుకలో ఒక డ్యాన్స్ మామ కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు మొదట్లో ఇది ఒక నృత్య కదలిక అని భావించారు. కానీ అతను చాలా సేపటి వరకు లేవకపోవడంతో.. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

వీడియో చూడండి..

మృతుడిని బర్వానీ జిల్లాలోని పిప్లుడ్ గ్రామానికి చెందిన ఘనశ్యామ్ యాదవ్ గా గుర్తించారు. ఆయన తన కుటుంబంతో కలిసి ఓజ్రాకు ఒక వివాహానికి హాజరయ్యారు. మంగళవారం రాత్రి మెహందీ వేడుకలో కుటుంబ సభ్యులు సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తున్నారు. ఘనశ్యామ్ తన భార్యతో కలిసి “రబ్ సే క్యా మంగు, జబ్ తు మేరే కరీబ్…” పాటకు నృత్యం చేస్తుండగా అకస్మాత్తుగా నేలపై కుప్పకూలిపోయాడు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. అప్పటివరకు డ్యాన్స్ చేస్తూ అందర్నీ నవ్వించిన ఘనశ్యామ్ యాదవ్.. ఇలా గుండెపోటుతో చనిపోతాడనుకోలేదని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us