Watch Video: రెస్టారెంట్‌లో వాష్‌రూమ్‌కు వెళ్లిన మహిళ.. లోపల కనిపించింది చూసి ఒక్కసారిగా కేకలు.. కట్‌చేస్తే..

సూరత్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పిప్లోడ్‌లో లోని ఓ ప్రసిద్ధ రెస్టారెంట్‌లో వాష్‌రూమ్‌కు వెళ్లిన మహిళకు అక్కడ రహస్య మొబైల్ కెమెరా కనిపించాయి. దీంతో ఒక్కసారిగా కంగారుపడిపోయిన మహిళ వాష్‌రూమ‌ నుంచి బయటకు వచ్చి రెస్టారెంట్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చింది. దీంతో మొబైల్‌ను స్వాధీనం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు రెస్టారెంట్‌ యాజమాన్యం. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలను కనుగొన్నారు.

Watch Video: రెస్టారెంట్‌లో వాష్‌రూమ్‌కు వెళ్లిన మహిళ.. లోపల కనిపించింది చూసి ఒక్కసారిగా కేకలు.. కట్‌చేస్తే..
Surat Restaurant Hidden Cam

Updated on: Aug 18, 2025 | 3:19 PM

రోజురోజుకు కామాందులు పెరిగిపోతున్నారు. కాలేజ్, స్కూల్, శాంపింగ్ మాల్, రెస్టారెంట్, రైల్వే స్టేషన్ ఇలా ఎక్కడ పడితే అక్కడ మహిళలను వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారు. బాత్రూమ్లలో సీక్రెట్కెమెరాస్ పెట్టి వారి నగ్నవీడియోలు చిత్రీకరించి వాటిలో బ్లాక్మెయిల్స్కు పాల్పడుున్నారు తాగాజా ఇలాంటి ఘటనే సూరత్‌లోని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్‌లో వెలుగు చూసింది. రెస్టారెంట్లోని మహిళల వాష్‌రూమ్‌లో మొబైల్ ఫోన్‌ను రహస్యంగా ఉంచి రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్‌లోని వాష్‌రూమ్‌లో ఏర్పాటు చేసిన వెంటిలేషన్ గ్రిల్ వెనుక ఉంచిన మొబైల్ ఫోన్‌ను వాష్రూమ్కు వెళ్లిన ఒక మహిళ గుర్తించింది. దీంతో, కంగారుపడి పడిపోయినహిళ ఈ విషయాన్ని రెస్టారెంట్ యాజమాన్యానికి తెలియజేసింది. ఆ మహిళతో పాటు ఇతర వ్యక్తులు కూడా ఈ సంఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఇది కూడా చదవండిఆర్టీసీ కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి.. కారణం తెలిస్తే అవాకవ్వాల్సిందే!

ఈ సంఘటన తర్వాత, కొంతమంది వ్యక్తులు ఈ మహిళల వాష్‌రూమ్‌కు క్లీన్చేయడానికి వెళ్తున్నట్టు ఆరోపించారు. ఆ తర్వాత ఈ సంఘటన సీరియస్‌గా మారింది. దీంతో విషయం కాస్తా ఉమ్రా పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాష్రూమ్లో పెట్టిన మొబైల్అక్కడే క్లీనర్గా పనిచేస్తున్న సురేంద్ర రాణాదిగా పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.

నిందితుడు రెండేళ్లుగా రెస్టారెంట్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్నాడు.

సురేంద్ర రాణా గత 2 సంవత్సరాలుగా ఈ రెస్టారెంట్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. మహిళల వాష్‌రూమ్‌ను శుభ్రం చేసే  క్రమంలో బాత్రూమ్వెంటిలేట్వెనుక మొబైల్కెమెరాలను పెట్టినట్టు గుర్తించారు. సురేంద్రను అరెస్టు చేసిన తర్వాత, పోలీసులు అతని నుండి మొత్తం 5 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తనిఖీ చేయగా అందులో అతని ఫోన్‌లో పోర్న్ హిస్టరీ, స్పై క్యామ్ బాక్స్ కూడా పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకర పాము ఇదేనట.. ఎందుకో తెలుసా?

ఇక దర్యాప్తులో భాగంగా సురేంద్ర జార్ఖండ్కు చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇతను ఫోన్లోని వీడియోలను ఒక ఫోన్నుంచి మరోక ఫోన్కు బదిలీ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెస్టారెంట్లోని ఇతర సిబ్బందిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆ రెస్టారెంట్‌లో మొత్తం 50 మంది పనిచేస్తున్నారు, వారిలో 40 మంది పురుషులు. పోలీసులు ఇప్పుడు అనుమానిత ఉద్యోగులందరి మొబైల్ ఫోన్‌లను FSL (ఫోరెన్సిక్ లాబొరేటరీ)కి పంపబోతున్నారు. సురేంద్ర స్నేహితుల సర్కిల్‌ను కూడా దర్యాప్తు చేసి, వారి నేపథ్యం, సంబంధాలు, వారు అలాంటి కుట్రలో మరేదైనా పాల్గొన్నారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.