Shirdi Temple: షిరిడీ వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆలయ దర్శన సమయాల్లో మార్పులు.. వివరాలివే.!

|

Mar 30, 2021 | 8:07 PM

Shirdi Temple Timings: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించడంతో షిరిడీలోని సాయిబాబా ఆలయ అధికారులు..

Shirdi Temple: షిరిడీ వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆలయ దర్శన సమయాల్లో మార్పులు.. వివరాలివే.!
Shirdi
Follow us on

Shirdi Temple Timings: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించడంతో షిరిడీలోని సాయిబాబా ఆలయ అధికారులు దర్శన సమయాల్లో కీలక మార్పులు చేశారు. ఇకపై ఉదయం 7.15 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు భక్తుల సందర్శనార్ధం ఆలయం తెరిచి ఉంటుందని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు.

వాస్తవానికి భక్తుల సందర్శనార్ధం సాయిబాబా ఆలయం ప్రతీ రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉండనుండగా.. నైట్ కర్ఫ్యూ, పెరుగుతోన్న కరోనా కేసుల దృష్ట్యా సమయ వేళల్లో మార్పులు చేశామని అన్నారు. ఇక భక్తుల కోసం ఉచిత ఆహారం అందించే శ్రీ సాయి ప్రసాదాలయ ఇకపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు తెరిచి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక ప్రతీ రోజూ తెల్లవారుజామున 4.30 గంటలకు కాకాడ్ ఆర్తీ(మొదటి ఆర్తీ).. అలాగే రాత్రి 10.30 గంటలకు చివరి ఆర్తీ జరుగుతాయని.. ఆ సమయంలో భక్తులకు ఆలయ ప్రాంగణంలో అనుమతి లేదని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక ప్రకటనను జారీ చేసింది. ఈ చర్యలు ప్రజల ప్రయోజనాల కోసమే తీసుకున్నామని.. ప్రతీ ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ భక్తుల సందర్శనార్ధం గతేడాది నవంబర్ 20వ తేదీ నుంచి షిరిడీ సాయిబాబా ఆలయాన్ని తెరిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రతీ రోజూ లక్షల్లో భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటున్నారు.

Also Read:

చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!

మరణించాడనుకుని అంత్యక్రియలు పూర్తి.. మూడు నెలల తర్వాత తిరిగొచ్చిన చనిపోయిన వ్యక్తి.. ట్విస్ట్ ఇదే.!