నివర్ తుఫాన్‌.. పుదుచ్చేరిలో ఈ రాత్రి నుంచి 144 సెక్షన్‌.. తమిళనాట రెడ్‌ అలర్ట్‌

| Edited By:

Nov 24, 2020 | 4:09 PM

నివర్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్‌ తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది

నివర్ తుఫాన్‌.. పుదుచ్చేరిలో ఈ రాత్రి నుంచి 144 సెక్షన్‌.. తమిళనాట రెడ్‌ అలర్ట్‌
Follow us on

Cyclone Nivar Updates: నివర్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్‌ తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం పళని స్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామితో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కేంద్రం తరఫున అన్ని విధాలుగా సాయపడుతుందని హామీ ఇచ్చారు. (జగిత్యాల జిల్లాలో దారుణం.. అల్లుడిని సజీవ దహనం చేసిన అత్తింటి వారు)

ఇదిలా ఉంటే నివర్ తుఫాన్ నేపథ్యంలో పుదుచ్చేరిలో ఇవాళ రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు 144సెక్షన్‌ విధించారు. ఈ సమయంలో షాపులు కూడా మూసివేయాలని తెలిపారు. మరోవైపు తమిళనాట రెడ్‌ అలర్ట్ విధించారు. బుధవారం పబ్లిక్ హాలీడే ప్రకటించారు. చెన్నై నుంచి నాగపట్నం వైపు వెళ్లే రైళ్లను రైల్వేశాఖ రద్దు చేయగా, ఎం.డి.ఆర్.ఎఫ్ బృందాలు ప్రభావితమయ్యే ప్రాంతాలకు చేరుకున్నాయి. (స్పీడు మీదున్న శర్వానంద్‌.. బైలింగ్వవల్‌ మూవీ షూటింగ్ పూర్తి.. ఫొటో షేర్ చేసిన నటుడు)