Circular issued: విద్యార్థులూ కర్చీఫ్‌లు వద్దు.. కానీ అవి మాత్రం తప్పనిసరి.. సర్క్యూలర్ జారీ చేసిన విద్యాశాఖ..

|

Jan 30, 2021 | 6:02 PM

Circular issued: విద్యార్థులెవరూ మాస్కులు ధరించడం లేదంటూ ఫిర్యాదు వెల్లువెత్తిన నేపథ్యంలో తమిళనాడు పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు..

Circular issued: విద్యార్థులూ కర్చీఫ్‌లు వద్దు.. కానీ అవి మాత్రం తప్పనిసరి.. సర్క్యూలర్ జారీ చేసిన విద్యాశాఖ..
ప్రతీకాత్మక చిత్రం
Follow us on

Circular issued: విద్యార్థులెవరూ మాస్కులు ధరించడం లేదంటూ ఫిర్యాదు వెల్లువెత్తిన నేపథ్యంలో తమిళనాడు పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు మాస్క్ ధరించకుండా వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది. అసలేం జరిగిందంటే.. తమిళనాడు వ్యాప్తంగా ఈనెల 19వ తేదీ నుంచి 10వ తరగతి, ప్లస్ టూ విద్యార్థులు క్లాస్‌లు ప్రారంభించారు. అయితే విద్యార్థులంతా మాస్క్‌లు ధరించకుండా పాలశాలలకు వస్తున్నారు. మాస్క్‌లకు బదులుగా కర్చీఫ్‌లను మొహానికి కట్టుకుంటున్నారు.

ఈ వ్యవహారంపై పలువురు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల సీరియస్‌గా తీసుకున్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కరుపన్నన్.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సర్క్యూలర్ జారీ చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందే అని స్పష్టం చేశారు. మాస్క్‌లు ఉంటేనే విద్యార్థులను తరగతి గదిలోకి అనుమతించాలని, కర్చీఫ్‌లు కట్టుకుంటే కుదరదని సర్క్యూలర్‌లో కరుపన్నన్ స్పష్టం చేశారు. ఈ సర్క్యూలర్‌లోని అంశాలను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విధిగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు.

Also read:

Delhi Violence: ఢిల్లీలో అల్లర్లు అసాంఘిక శక్తుల పనే.. దీనిపై న్యాయ విచారణకు ఆదేశించాలి.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్

Justice Pushpa Virendra Ganediwala: ఎవరీ జస్టిస్ పుష్ప గనేడివాలా..? ఆమె తీర్పులు ఎందుకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి?