Delhi Violence: ఢిల్లీలో అల్లర్లు అసాంఘిక శక్తుల పనే.. దీనిపై న్యాయ విచారణకు ఆదేశించాలి.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కాంగ్రెస్ నాయకుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిచారు. అల్లర్లు జరిగిన తరువాత కేంద్ర ప్రభుత్వం దీనిపై న్యాయ విచారణకు..

Delhi Violence: ఢిల్లీలో అల్లర్లు అసాంఘిక శక్తుల పనే.. దీనిపై న్యాయ విచారణకు ఆదేశించాలి.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్
Follow us

|

Updated on: Jan 30, 2021 | 5:50 PM

Rajasthan CM Ashok Gehlot: గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కాంగ్రెస్ నాయకుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిచారు. అల్లర్లు జరిగిన తరువాత కేంద్ర ప్రభుత్వం దీనిపై న్యాయవిచారణకు ఎందుకు ఆదేశించలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. దాదాపు 70 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు ఒక్కసారిగా ఎందుకు ఇలా ప్రవర్తించారు.. దీనిపై కచ్చితంగా విచారణ జరిపించాలని సీఎం గెహ్లాట్ అభిప్రాయం వ్యక్తంచేశారు. శనివారం జరిగిన ఓ సమావేశంలో గెహ్లాట్ రైతుల ఆందోళన, ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ అల్లర్లు, ఉద్రిక్తత పరిస్థితులపై మాట్లాడారు. జనవరి 26న జరిగిన అల్లర్లను ఎవరూ సమర్ధించరని సీఎం గెహ్లాట్ స్పష్టంచేశారు. తాము కూడా హింసాత్మక ఘటనను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎర్రకోట వద్ద కొందరు ఆందోళన కారులు చేసిన అల్లర్లు ప్రతి ఒక్కరినీ బాధించాయని పేర్కొన్నారు. ట్రాక్ట‌ర్ ర్యాలీలో హింస చోటుచేసుకోవ‌డం అసాంఘిక శ‌క్తుల ప‌నేన‌ని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. రైతులు గ‌త 65 రోజుల నుంచి ఢిల్లీలో నిర్వ‌హిస్తున్న ఆందోళ‌నలో ఎంతో నిగ్ర‌హం క‌న‌బ‌ర్చార‌ని ఆయ‌న ప్రశంసించారు. రైతులంతా శాంతియుతంగా తమ డిమాండ్లను పరిష్కరించుకోవాలని కోరారు. దీనిపై న్యాయ కమిటీని వేసి నిష్పక్షపాతంగా విచారణ జరపించాలని గెహ్లాట్ డిమాండ్ చేశారు.

Also Read:

Justice Pushpa Virendra Ganediwala: ఎవరీ జస్టిస్ పుష్ప గనేడివాలా..? ఆమె తీర్పులు ఎందుకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి

రిపబ్లిక్ డే నాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శశిథరూర్, జర్నలిస్టులపై పోలీసు కేసులు,