RBI Grade B Recruitment 2021: ఆర్‌బీఐలో ఉద్యోగాలు.. నెలకు రూ.83 వేల వరకూ వేతనం.. దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 15

|

Feb 08, 2021 | 11:23 AM

RBI Grade B Recruitment 2021: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది...

RBI Grade B Recruitment 2021: ఆర్‌బీఐలో ఉద్యోగాలు.. నెలకు రూ.83 వేల వరకూ వేతనం.. దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 15
Follow us on

RBI Grade B Recruitment 2021: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఆర్బీఐ గ్రేడ్‌ బి రిక్రూట్‌మెంట్‌2021.. గ్రేడ్‌ బి-డీఆర్‌ (జనరల్‌), డీఈపీఆర్‌, డీఎస్‌ఐఎంలో అధికారుల నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఆసక్తిగల అర్హత ఉన్న అభ్యర్థులందరు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువు ఉంది. అభ్యర్థులు బ్ఆయంక్‌ వెబ్‌ సైట్‌ rbi.org.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నెలకు రూ.83 వరకూ జీతం ఉంటుందని తెలిపింది.

ఆర్బీఐ రిక్రూట్‌మెంట్‌ 2021 ఖాళీల వివరాలు

మొత్తం ఖాళీలు: 322
గ్రేడ్‌-బి )డీఆర్‌) జనరల్‌ – పీవై 2021 -270

అర్హత : కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌, తత్సమాన, పోస్టు గ్రాడ్యుయేషన్‌, సంబంధిత టెక్నికల్‌ సబ్జెటక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

గ్రేడ్‌-బీ (డీఆర్‌) డీఈపీఆర్‌-పీవై 2021: 29 పోస్టులు
అర్హత : క‌నీసం 55% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ, త‌త్స‌మాన, పీజీడీఎం, లేదా ఎంబీఏ ఉత్తీర్ణ‌త ఉండాలి‌.

గ్రేడ్‌-బీ (డీఆర్‌) డీఎస్ఐఎం-పీవై 2021: 23 పోస్టులు
అర్హ‌త‌: క‌నీసం 55% మార్కుల‌తో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త ఉండాలి‌.

వయసు: 01.01.2021 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష ఫేజ్‌-1, ఫేజ్‌-2, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: జనవరి 28, 2021.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఫిబ్రవరి 15, 2021.
వెబ్‌సైట్‌:https://www.rbi.org.in/

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ రైల్వేలో 2532 జాబ్స్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు..