Farm Laws: చట్టాలను రద్దుచేయకపోతే ఈసారి పార్లమెంట్ ముట్టడే.. 40 లక్షల ట్రాక్టర్లతో కవాతు: రైతు సంఘం నేత తికాయత్

|

Feb 24, 2021 | 9:42 AM

Farmers Protest: కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే పార్లమెంటును ముట్టడిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు...

Farm Laws: చట్టాలను రద్దుచేయకపోతే ఈసారి పార్లమెంట్ ముట్టడే.. 40 లక్షల ట్రాక్టర్లతో కవాతు: రైతు సంఘం నేత తికాయత్
Rakesh Tikait
Follow us on

Farmers Protest: కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే పార్లమెంటును ముట్టడిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ తికాయత్ హెచ్చరించారు. ఢిల్లీ మార్చ్‌కు ఏ క్షణంలో అయినా పిలుపు రావచ్చని.. దీనికి సన్నద్ధంగా ఉండాలని తికాయత్ రైతులను కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాజస్థాన్‌లోని సికార్‌లో జరిగిన కిసాన్‌ మహాపంచాయత్‌లో ప్రసంగించారు. ఢిల్లీ మార్చ్‌కు ఏ క్షణంలోనైనా పిలుపురావచ్చని, అందుకు రైతులు సన్నద్ధంగా ఉండాలని తికాయిత్‌ కోరారు.

ఈ సారి ఢిల్లీ మార్చ్.. పార్లమెంటు ముట్టడి కోసమే ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. అయితే ఈ సారి నాలుగు లక్షల ట్రాక్టర్లు కాదని.. 40లక్షల ట్రాక్టర్లతో కవాతు నిర్వహిస్తామని తికాయత్ పేర్కొన్నారు. ఆందోళనలో పాల్గొంటున్న రైతులు ఢిల్లీలోని ఇండియా గేటు వద్ద ఉన్న పార్కులను దున్ని, పంటలు సాగు చేయగలరని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోయినా, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించకపోయినా.. తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరారు.

Also Read:

NTPC Jobs 2021: ఎన్‌టీపీసీ నుంచి 230 జాబ్స్ నోటిఫికేషన్.. బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ.. అర్హులెవరంటే..

రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం.. టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ అయితే.. ఫ్రీ రైడ్..!