”ఇందిరా ర‌సోయి” ప‌థ‌కం.. 8 రూపాయ‌ల‌కే భోజ‌నం

| Edited By:

Aug 21, 2020 | 10:28 PM

ఇందిరా ర‌సోయి' పేరుతో స‌రికొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించింది రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం. ఈ ప‌థ‌కం ద్వారా పేద‌ల‌కు 8 రూపాయ‌ల‌కే పౌష్టిక‌ర‌మైన‌ భోజ‌నాన్ని ప్ర‌భుత్వం అందించ‌బోతుంది. గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్‌..

ఇందిరా ర‌సోయి ప‌థ‌కం.. 8 రూపాయ‌ల‌కే భోజ‌నం
Follow us on

‘ఇందిరా ర‌సోయి’ పేరుతో స‌రికొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించింది రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం. ఈ ప‌థ‌కం ద్వారా పేద‌ల‌కు 8 రూపాయ‌ల‌కే పౌష్టిక‌ర‌మైన‌ భోజ‌నాన్ని ప్ర‌భుత్వం అందించ‌బోతుంది. గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్‌ ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవ‌రూ పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డకూడ‌ద‌నే ముఖ్య ఉద్ధేశ్యంతోనే ఈ ప‌థకాన్ని స్టార్ట్ చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌తీ రోజూ రెండు సార్లు భోజ‌నాన్ని అందించ‌నున్నారు. ఈ ప‌థ‌కం అమ‌లుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తీ యేటా రూ.100 కోట్ల‌ను ఖ‌ర్చు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. రాజీవ్ గాంధీ 75వ జ‌యంతి సంద‌ర్భంగా ఇందిరా ర‌సోయి ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు సీఎం అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.

Read More:

సోనూ భాయ్ నాకూ సాయం చేయ్‌.. బ్ర‌హ్మాజీ ట్వీట్

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్‌

ప్ర‌భాస్ ‘ఆది పురుష్’ గ్రాఫిక్స్‌ కోసం అంత ఖ‌ర్చా?

నాని ‘వి’ సినిమా ఆ రోజే రిలీజ్ ఎందుకో తెలుసా?