జల్లికట్టు పోటీలను వీక్షించడానికి మధురైకి రాహుల్‌ గాంధీ.. అలాంగనల్లూర్‌లో పోటీలను ప్రారంభించనున్న సీఎం..

| Edited By: Pardhasaradhi Peri

Jan 14, 2021 | 7:31 AM

Rahul Gandhi: దక్షిణ తమిళనాడులోని మధురై జిల్లాలో ఇవాటి నుంచి సంక్రాంత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముఖ్య

జల్లికట్టు పోటీలను వీక్షించడానికి మధురైకి రాహుల్‌ గాంధీ.. అలాంగనల్లూర్‌లో పోటీలను ప్రారంభించనున్న సీఎం..
Follow us on

Rahul Gandhi: దక్షిణ తమిళనాడులోని మధురై జిల్లాలో ఇవాటి నుంచి సంక్రాంత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముఖ్య నగరమైన మధురై జిల్లాలో జల్లికట్టు పోటీలు ప్రారంభంకానున్నాయి. 14 న అవనీయపురం , 15 న పాలమేడు , 16 న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలాంగనల్లూర్‌లో జల్లికట్టు పోటీలు జరుగుతాయి. అవనీయపురం జల్లికట్టు పోటీలలో 700 ఎద్దులు, 300 మంది వీరులు పాల్గొనగా, 10 ప్రత్యేక వైద్య బృందాలను అధికారులు అందుబాటులో ఉంచారు.

అవనీయపురం జల్లికట్టు పోటీలను వీక్షించడానికి కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ మదురై రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నేత కె.ఎస్. అళగిరి మాట్లాడుతూ.. ఎద్దులు రైతుల జీవితాల్లో భాగమని, రాహుల్ పర్యటన ఈ పంటల సీజన్‌లో అన్నదాతల ఉత్సాహానికే కాక , తమిళ సంస్కృతికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 16 న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలాంగనల్లూర్‌లో జరగనున్న జల్లికట్టు పోటీలు సీఎం పళనిస్వామి ప్రారంభిస్తారు.

మధురై జిల్లాలో జల్లికట్టు పోటీలు నిర్వహించాలని కమిటీ తీర్మానం.. డోలాయమానంలో తమిళనాడు సర్కారు.!