Puducherry CM Vs PWD Minister : ఓవైపు పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు.. మరోవైపు కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు

|

Jan 25, 2021 | 1:19 PM

త్వరలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం రెడీ అవుతుంది. మరోవైపు అక్కడ కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. అక్కడ కాంగ్రెస్ నేతల మధ్య వర్గ పోరు

Puducherry CM Vs PWD Minister : ఓవైపు పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు.. మరోవైపు కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు
Follow us on

Puducherry CM Vs PWD Minister : త్వరలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం రెడీ అవుతుంది. మరోవైపు అక్కడ కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. అక్కడ కాంగ్రెస్ నేతల మధ్య వర్గ పోరు ఓ రేంజ్ లో జరుగుతుంది. సీఎం నారాయణ స్వామి మంత్రి నమశివాయ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. 2016 ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా నమశివాయ ను ప్రకటించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రిగా నారాయణ స్వామి బాధ్యతలు చేపట్టారు. అప్పుడు నమశివాయ కు పి.డబ్ల్యు మంత్రి గా అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి స్వపక్షంలోనే నేతల మధ్య వైరం మొదలైంది. నమశివాయ కు సీఎం తో విబేధాలు ఏర్పడ్డాయి. తాజాగా నమశివాయను కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. దీంతో మంత్రి తన వర్గం ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేయమని తెలిపాడు.. మరో రెండు నీళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా పరిస్థితులతో అక్కడ కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది.  మరోవైపు నమశివాయ తన వర్గాన్ని తీసుకుని బీజేపీ లో చేరడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: నిమ్మగడ్డ తీరుని తప్పుపడుతూ మీ వెనుక ఏదో అదృశ్య శక్తి నడిపిస్తుందంటూ ముద్రగడ లేఖ