Mudragada Letter to SEC : నిమ్మగడ్డ తీరుని తప్పుపడుతూ మీ వెనుక ఏదో అదృశ్య శక్తి నడిపిస్తుందంటూ ముద్రగడ లేఖ

పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో జగన్ సర్కార్ , ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ల మధ్య ఓ రేంజ్ లో యుద్ధం సాగుతుంది. తాజాగా ఇదే అంశంపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఎస్ఈసీ వైఖరిని తప్పుబడుతూ..

Mudragada Letter to SEC : నిమ్మగడ్డ తీరుని తప్పుపడుతూ మీ వెనుక ఏదో అదృశ్య శక్తి నడిపిస్తుందంటూ ముద్రగడ లేఖ
Follow us

|

Updated on: Jan 25, 2021 | 12:54 PM

Mudragada Letter to SEC : ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో జగన్ సర్కార్ , ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ల మధ్య ఓ రేంజ్ లో యుద్ధం సాగుతుంది. తాజాగా ఇదే అంశంపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఎస్ఈసీ వైఖరిని తప్పుబడుతూ ఓ లేఖ రాశారు.

ఓ వైపు కరోనా విజృంభణ.. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుండగా.. పంచాయతీ ఎన్నికలు నిర్వహణ ఏమిటి అంటూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వైఖరిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఈ వివాదం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. జస్టిస్ సంజయ్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిమ్మగడ్డ మరేశ్ కుమార్ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్ఈసీ కి హితవు పలుకుతూ ఓ ఉత్తరాన్ని రాశారు.

ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి రాజకీయాలు చేయడం మంచిది కాదని చెప్పారు. ఇటువంటి పరిస్థితి ఒక్క భారత దేశంలోనే తొలిసారిగా చూస్తున్నామని విమర్శించారు. మీకు వీలైతే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి.. వీలైతే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి అని ఆ లెటర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తుంటే.. ఆయన వెనుక అదృశ్య శక్తి నడిపిస్తుందని అనుమానం కలుగుతుందన్నారు ముద్రగడ. ఏపీ ప్రభుత్వం పై ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేస్తున్నదాడిని మీడియా ద్వారా చూస్తున్నాను.. ప్రస్తుతం ఏపీలోని పరిస్థితిని నిమ్మగడ్డ అర్ధం చేసుకుని ఎన్నికల నిర్వహణ చేపట్టాలి అంతేగానీ రాజకీయ నాయకుల్లా పట్టుదలకు పోయి పంచాయితీ ఎన్నికలను నిర్వహించి తీరుతాం అంటూ పట్టుదలకు పోరాదని హితవు చెప్పారు. ఇప్పటికైనా ఎన్నికలంటూ రచ్చ చేయడం మానేసి.. ఎస్ఈసీ ప్రభుత్వానికి సహకరిస్తూ.. ముందుకు పోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: విదేశీ అతిథి లేకుండానే ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు..ఇలా జరగడం నాలుగోసారి, ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలుసా..!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..