PM Modi: కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు.. మహారాష్ట్ర ఫలితాలపై మోడీ సంచలన వ్యాఖ్యలు

|

Nov 23, 2024 | 9:22 PM

PM Modi: మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారని, కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయని విమర్శించారు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయి.. వికసిత్‌ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని అన్నారు. యూపీ,

PM Modi: కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు.. మహారాష్ట్ర ఫలితాలపై మోడీ సంచలన వ్యాఖ్యలు
Follow us on

దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది మహారాష్ట్ర ఫలితం. మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ ఇక స్పీడ్‌ పెంచబోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై గట్టిగా గురిపెట్టబోతోంది. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులేసేందుకు కమలదళం సిద్ధమవుతోంది. దేశమంతా కాషాయజెండా ఎగరాలన్న బీజేపీ లక్ష్యానికి.. బలం చేకూర్చింది మహారాష్ట్ర ఫలితం. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్‌షా, నడ్డా, రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలారా చెవులు రిక్కించి వినండి అంటూ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏశక్తీ ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదని, దేశంలో ఒకే రాజ్యాంగం ఉందని, అది అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ఒక్కటే అని అన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ అవమానించాలని చూసిందని, రెండు రాజ్యాంగాలు ఉండాలన్న కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు.

పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ హామీలు అమలుచేయలేదని, అందుకే జనం కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని ఆరోపించారు.

మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారని, కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయని విమర్శించారు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయి.. వికసిత్‌ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని అన్నారు. యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బీజేపీకి బలం చేకూరిందని, షిండే, ఫడ్నవీస్‌, అజిత్‌పవార్‌కు మోడీ అభినందనలు తెలియజేశారు. 50 ఏళ్ల తర్వాత ఇది అతి పెద్ద విజయం అంటూ మోడీ వ్యాఖ్యానించారు. సీఎంలను తీసుకొచ్చి ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పరాన్నజీవిగా మారిందని, ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, హర్యానాతో పాటు.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఖాతా ఖాళీ అయ్యిందని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి