Constitution Day: రేపు రాజ్యాంగ దినోత్సవం.. పార్లమెంట్‌లో జరిగే కార్యక్రమానికి ప్రధాని మోడీ..

|

Nov 25, 2021 | 8:06 AM

నవంబర్ 26న 'రాజ్యాంగ దివస్' వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ  సందర్భంగా పార్లమెంటు  విజ్ఞాన్ భవన్‌లలో..

Constitution Day: రేపు రాజ్యాంగ దినోత్సవం.. పార్లమెంట్‌లో జరిగే కార్యక్రమానికి ప్రధాని మోడీ..
Pm Modi
Follow us on

Constitution Day: నవంబర్ 26న ‘రాజ్యాంగ దివస్’ వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ  సందర్భంగా పార్లమెంటు  విజ్ఞాన్ భవన్‌లలో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  రాజ్యాంగ ప్రవేశికను చదవి వినిపిస్తారు. 

 అనంతరం.. భారత రాజ్యాంగం నవీకరించబడిన సంస్కరణను కూడా విడుదల చేస్తారు. ఇది ఇప్పటివరకు అన్ని సవరణలను కలిగి ఉంటుంది. రాజ్యాంగ ప్రజాస్వామ్యంపై ఆన్‌లైన్ క్విజ్‌ను కూడా ఆయన ప్రారంభిస్తారు. అదే సమయంలో శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు విజ్ఞాన్ భవన్‌లోని ప్లీనరీ హాల్‌లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రెండు రోజుల రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రధాని ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ఇతర సీనియర్ న్యాయమూర్తులు, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇతర న్యాయ రంగ సభ్యులు హాజరుకానున్నారు. కోవిడ్-19 ప్రోటోకాల్‌ను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 26న జరిగే రాష్ట్రపతి సమావేశానికి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పాఠశాలలు, కళాశాలలు, సంస్థలు, వివిధ సంస్థలు, పౌరులు హాజరు కావాలని గతంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేసారు.

2015 నుంచి రాజ్యాంగ దివస్..

రాజ్యాంగ దివస్ఈ కార్యక్రమాన్ని 2015 నుంచి నిర్వహించుకుంటున్నాం.  ఈ కార్యక్రమంలో  పార్లమెంటరీపై ఆన్‌లైన్ క్విజ్ పోటీని నిర్వహిస్తారు. ఇందులో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు.

ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా రాజ్యాంగ ప్రవేశికను 22 అధికార భాషల్లో కాని ఆంగ్లంలో చదివేందుకు ఏర్పాట్లు చేశారు. ఎవరైనా ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ భాషలలో దేనిలోనైనా రాజ్యాంగ ప్రవేశికను చదవవచ్చు.

నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే 1949లో ఈ రోజున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవం ప్రారంభమైంది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: జీవితంలో మార్పును కోరుకుంటున్నారా.. చాణక్యుడు చెప్పిన అద్భుత సూత్రాలు ఇవే..

Aghora Marriage Watch: అఘోరా వెడ్స్‌ అఘోరి.. సోషల్ మీడియాలో సంచనలంగా మారిన వీరి వివాహం..