Fact Check: కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ రూ.4 వేల సాయం.? వైరల్‌ అవుతోన్న ఈ వార్తపై క్లారిటీ ఇచ్చిన అధికారులు..

|

Oct 22, 2021 | 5:19 PM

Fact Check: సోషల్‌ మీడియా వినియోగంతో సమాచార మార్పిడి సులభంగా మారిందని సంతోషించాలో.. దీనివల్ల పెరుగుతోన్న తప్పుడు ప్రచారాలను చూసి దిగులు చెందాలో..

Fact Check: కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ రూ.4 వేల సాయం.? వైరల్‌ అవుతోన్న ఈ వార్తపై క్లారిటీ ఇచ్చిన అధికారులు..
Follow us on

Fact Check: సోషల్‌ మీడియా వినియోగంతో సమాచార మార్పిడి సులభంగా మారిందని సంతోషించాలో.. దీనివల్ల పెరుగుతోన్న తప్పుడు ప్రచారాలను చూసి దిగులు చెందాలో అర్థం కానీ పరిస్థితి వచ్చింది. సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తను నమ్మాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన రోజులు వచ్చాయి. ఈ క్రమంలోనే రోజుకో వార్త నెట్టింట హంగామా చేస్తుంది. ఇక ప్రజల బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుంటోన్న కొందరు మోసగాళ్లు సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే రకరకాల పథకాల పేర్లతో బురిడీ కొట్టిస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఓ వార్తే నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘ప్రధాన మంత్రి రంబన్‌ సురక్ష యోజన’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చిందని.. ఈ పథకంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం రూ. 4 వేలు ఆర్థిక సాయం చేస్తుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే ఈ పథకం విషయమై ప్రభుత్వం ఎట్టకేలకు అధికారికంగా స్పందించింది.

ప్రధాన మంత్రి రంబన్‌ సురక్ష యోజన పథకం పేరుతో జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదని అధికారికంగా తెలిపింది. ఇందులో భాగంగానే ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ట్విట్టర్‌ వేదికగా ఓ ట్వీట్‌ చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా జరుగుతోన్న ఈ ఫేక్‌ ప్రచారానికి చెక్‌ పడినట్లైంది.

Also Read: Shoaib Akhtar: షోయబ్‌ అక్తర్ సంచలన వ్యాఖ్యలు.. కోహ్లీ కంటే పెద్ద బ్యాట్స్‌మెన్‌ ఉన్నారట..!

TDP Anitha: వైసీపీ నేతలు మహిళలను అవమానిస్తే సహించేది లేదు.. తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత హెచ్చరిక

దేశంలో అతిపెద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ను నిర్మించనున్న గెయిల్‌ ఇండియా