Yashwant Sinha Nomination: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా నామినేషన్.. హాజరైన పలు పార్టీల నేతలు..

|

Jun 27, 2022 | 12:34 PM

సోమవారం మధ్యాహ్నం 12:15 గంటలకు యశ్వంత్ సిన్హా (Yashwant Sinha Nomination) నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

Yashwant Sinha Nomination: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా నామినేషన్.. హాజరైన పలు పార్టీల నేతలు..
Yashwant Sinha Nomination
Follow us on

Presidential Election 2022: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 12:15 గంటలకు యశ్వంత్ సిన్హా (Yashwant Sinha Nomination) నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కాగా.. అంతకుముందు పార్లమెంట్‌ అనెక్స్‌లో విపక్షనేతలంతా భేటీ అయి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత విపక్ష నేతలంతా యశ్వంత్‌ సిన్హాతో కలిసి వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కాగా.. సిన్హా నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఎంసీ, ఎన్సీపీ, వామపక్ష నేతలు, పలు పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

కాగా.. మరికాసేపట్లో యశ్వంత్‌ సిన్హాతో కలిసి విపక్షనేతలంతా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షాలు చర్చించనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎంపికైన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా.. సమర్ధుడైన అడ్మినిస్ట్రేటర్‌గా, పార్లమెంటేరియన్‌గా, కేంద్ర మంత్రిగా పలు హోదాల్లో సేవలందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..