Governors: ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా ఆర్మీ రిటైర్డ్‌ అధికారి.. పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పు..

|

Sep 10, 2021 | 8:57 AM

Ram Nath Kovind appoints new governors: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చడంతో పాటు ఉత్తరాఖండ్‌కు కొత్త గవర్నర్లను

Governors: ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా ఆర్మీ రిటైర్డ్‌ అధికారి.. పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పు..
Ram Nath Kovind
Follow us on

Ram Nath Kovind appoints new governors: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చడంతో పాటు ఉత్తరాఖండ్‌కు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం రాత్రి ఉత్తర్వులను జారీచేశారు. కాగా.. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న బన్వరిలాల్‌ పురోహిత్‌ను పంజాబ్‌ గవర్నర్‌గా నియమించారు. ఇప్పటివరకు ఆయన పంజాబ్‌ గవర్నర్‌ బాధ్యతలను అదనంగా పర్యవేక్షిస్తున్నారు. నాగాలాండ్‌ గవర్నర్‌గా ఉన్న మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎన్‌ రవిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. దీంతోపాటు.. అసోం గవర్నర్‌ జగదీశ్‌ ముఖికి నాగాలాండ్‌ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలాఉంటే.. ఇటీవల ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా ఉన్న మౌర్య రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మిత్‌ సింగ్‌ను నియమించారు. 2016లో సింగ్‌ ఆర్మీ నుంచి రిటైరయ్యారు. చైనాతో మిలటరీ వ్యవహారాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆయన్ను గవర్నర్‌గా నియమించింది. కాగా.. కొత్తగా నియమించిన గవర్నర్‌లు వారు కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అమల్లోకి రానున్నట్లు రాష్ట్రపతి భవన్‌ తెలిపింది.

Also Read:

Hyderabad: దిశ తరహాలోనే ఎన్‌కౌంటర్‌ చేయండి.. చిన్నారి హత్యపై స్థానికుల తిరుగుబాటు.. సైదాబాద్‌లో ఉద్రిక్తత

Covid-19 vaccine: రక్షణ కవచంలా కోవిడ్‌ వ్యాక్సిన్‌.. ఒక్క డోసు తీసుకున్నా.. మరణం నుంచి గట్టెక్కినట్లే..