PM Narendra Modi: అంతరిక్ష రంగంపై భారత్ ఫోకస్.. నేడు ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

|

Oct 11, 2021 | 10:23 AM

Indian Space Association: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం భారత అంతరిక్ష సంఘం (ISPA) ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అంతరిక్ష

PM Narendra Modi: అంతరిక్ష రంగంపై భారత్ ఫోకస్.. నేడు ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
Pm Narendra Modi
Follow us on

Indian Space Association: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం భారత అంతరిక్ష సంఘం (ISPA) ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అంతరిక్ష పరిశ్రమ ప్రతినిధులతో సంభాషించనున్నారు. ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనేది అంతరిక్ష, ఉపగ్రహ కంపెనీల ప్రధాన సంఘం. దీనిద్వారా భారత అంతరిక్ష పరిశ్రమ సమిష్టి స్వరంగా మారనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ట్విట్ చేసి వెల్లడించారు. తాను భారత అంతరిక్ష సంఘాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ రంగంలోని ప్రముఖ వాటాదారులతో సంభాషించనున్నానని తెలిపారు. స్పేస్, ఇన్నోవేషన్ ప్రపంచంపై ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి అంటూ ట్విట్ చేశారు.

ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) సైతం ప్రకటనను విడుదల చేసింది. ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌తో.. భారత అంతరిక్ష పరిశ్రమ సమష్టి స్వరంగా మారనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతరిక్ష, ఉపగ్రహ సాంకేతిక రంగంలో అధునాతన సామర్థ్యాలతో ప్రపంచస్థాయిలో స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంచేందుకు ప్రభుత్వం కంపెనీలకు ఊతమివ్వనుంది. ఈ మేరకు ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలు సహా భారతీయ అంతరిక్ష డొమైన్‌లోని వాటాదారులందరినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రధానమంత్రి నినాదం ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా.. అంతరిక్ష రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి, సాంకేతికంగా అభివృద్ధి చెందే లక్ష్యంతో ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌ను ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమంలో లార్సన్ & టూబ్రో, నెల్కో (టాటా గ్రూప్), వన్‌వెబ్, భారతీ ఎయిర్‌టెల్, మ్యాప్‌మిండియా, వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్ అనంత్ టెక్నాలజీ లిమిటెడ్, గోద్రెజ్, హ్యూస్ ఇండియా, అజిస్టా- BST ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, BEL, సెంటమ్ ఎలక్ట్రానిక్స్ మాక్సర్ ఇండియా కంపెనీ ప్రతినిధులతో ప్రధాని మోదీ సంభాషించున్నారు.

Also Read:

India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. భారీగా తగ్గిన కేసులు, మరణాలు..

Cruise Drug Case: షారూక్ ఖాన్ కు ఈరోజూ షాక్ తప్పదా? ఆర్యన్ బెయిల్ మార్గం ఇంకా తెరుచుకోలేదా?