
భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా తాజాగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో కీలక చర్చలు జరిపారు. ఈ ఫోన్ కాల్‌కు సంబంధించిన వివరాలను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, అమెరికా అధ్యక్షుడితో జరిపిన సంభాషణ ఎంతో సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. భారత్–అమెరికా సమగ్ర గ్లోబల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాల నాయకులు పూర్తి అంగీకారం తెలిపారు.
రెండు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.కేవలం ద్వైపాక్షిక అంశాలే కాకుండా, ప్రస్తుత ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచ శాంతి, భద్రతలను పెంపొందించడానికి కొనసాగుతున్న ఉమ్మడి ప్రయత్నాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు.
అంతర్జాతీయ స్థిరత్వాన్ని కాపాడటంలో భారత్-అమెరికా దేశాల భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లోనూ పరస్పర సంప్రదింపులను కొనసాగించాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Had a productive conversation with President Trump. We reviewed our bilateral cooperation in trade, defence, energy, critical technologies and other areas. We agreed to maintain close engagement to take our Comprehensive Global Strategic Partnership forward.
We also exchanged…
— Narendra Modi (@narendramodi) September 30, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.