ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లావాస్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం లావోస్ జరుగుతున్న 21వ ఆసియాన్ ఇండియా, 19వ తూర్పు ఆసియా సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆసియాన్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో 10 ASEAN సభ్య దేశాలు, ఎనిమిది భాగస్వామ్య దేశాలు హాజరయ్యాయి.. ఆస్ట్రేలియా, చైనా, భారతదేశం, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, రష్యా, అమెరికా ఈ సదస్సులో పాల్గొన్నాయి. మిల్టన్ హరికేన్ కారణంగా చనిపోయినవారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాల అధినేతలు, పలువురు ప్రముఖులు, ప్రతినిధులతో ప్రధాని భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని మోదీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా జ్ఞాపికలను అందజేశారు. లావోస్ అధ్యక్షుడు థోంగ్లోన్ సిసౌలిత్, న్యూజిల్యాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌కు కలకాల గుర్తుండిపోయేలా జ్ఞాపికలను అందజేశారు.
భారతదేశం- లావో మధ్య సంబంధాలను బలోపేతం చేసే విషయంపై లావోస్ ప్రధాని సోనెక్సే సిఫాండోన్‌తో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చినందుకు సిఫాండోన్‌ను ప్రధాని మోదీ అభినందించారు.
అనంతరం ప్రధాని మోదీ శుక్రవారం లావోస్ అధ్యక్షుడు థోంగ్లోన్ సిసౌలిత్‌తో కూడా భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేయడానికి నిబద్ధతను తెలియజేశారు. ఆర్థిక, రక్షణ రంగాలతోపాటు సంస్కృతి, ఇరు దేశాల మధ్య సంబంధాలు, అభివృద్ధి భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. లావోస్ అధ్యక్షుడు థోంగ్లోన్ సిసౌలిత్ కి పురాతన కాలానికి సంబంధించిన అద్భుతమైన బుద్ధుని ఇత్తడి విగ్రహం అందించారు.. ప్రాచీనకాలానికి సంబంధించిన బుద్ధుని విగ్రహం.. ఇత్తడితో తయారు చేసి మీనా వర్క్ తో రూపొందించారు. ఇది ఈ పాతకాలపు ఇత్తడి బుద్ధ విగ్రహాన్ని తమిళనాడులో తయారు చేసినది.. ఈ బుద్ధుని విగ్రహాన్ని క్లిష్టమైన మినా (ఎనామెల్) పనితో దీన్ని అలంకరించారు. నైపుణ్యం కలిగిన కళాకారులతో రూపొందించబడిన ఈ విగ్రహం దక్షిణ భారత హస్తకళ, బౌద్ధ తత్వశాస్త్రం సారాంశాన్ని కలిగి ఉంటుంది.
Had extensive deliberations with President Thongloun Sisoulith of Lao PDR. We reviewed the full range of bilateral ties between our nations. Talked about the extensive cultural cooperation in particular, and how it has brought our societies even closer. Complimented him and the… pic.twitter.com/B82kKpHptC
— Narendra Modi (@narendramodi) October 11, 2024
అనంతరం న్యూజిల్యాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో మోదీ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ.. మెజెస్టిక్ నెమళ్ల జ్ఞాపికను అందజేశారు. విలువైన రాళ్లతో పొదిగిన ఝలార్ వర్క్‌తో కూడిన అద్భుతమైన వెండి దీపం.. నెమళ్లతో రూపొందిచారు. ఝలార్ పని, విలువైన రాళ్లతో కూడిన ఈ వెండి దీపం జత భారతీయ హస్తకళలకు చెందిన అద్భుతమైన కళాఖండం. ఇది మహారాష్ట్ర శిల్పకళా వారసత్వం.. దీన్ని అద్భుతంగా రూపొందించారు.
Had an excellent meeting with the Prime Minister of New Zealand, Mr. Christopher Luxon. We value our friendship with New Zealand, bound together by a commitment to democracy, freedom and rule of law. Our talks covered sectors such as economic cooperation, tourism, education and… pic.twitter.com/0P2yi4qLlg
— Narendra Modi (@narendramodi) October 10, 2024
ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, అదేవిధంగా పలు దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..