Pragya Thakur: ‘నా వీడియో తీసినవాడు వచ్చే జన్మలో కూడా బాగుపడడు’… శపించిన ప్రజ్ఞా ఠాకూర్‌

ఎప్పుడూ వివాదాలతో చెలిమి చేస్తూ.. హాట్ టాపిక్‌గా నిలిచే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ ఇటీవల కబడ్డీ ఆడి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

Pragya Thakur: నా వీడియో తీసినవాడు వచ్చే జన్మలో కూడా బాగుపడడు... శపించిన ప్రజ్ఞా ఠాకూర్‌
Pragya Thakur

Updated on: Oct 16, 2021 | 9:36 PM

ఎప్పుడూ వివాదాలతో చెలిమి చేస్తూ.. హాట్ టాపిక్‌గా నిలిచే  బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ ఇటీవల కబడ్డీ ఆడి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లోని కాళీమాత‌ దేవాలయంలో అమ్మవారి దర్శించుకున్న అనంతరం.. ఆమె స్థానిక క్రీడాకులతో కలిసి కబడ్డీ ఆడారు. కబడ్డీ పోటీల కార్యక్రమంలో పాల్గొన్న యువతులు.. ఎంపీని కబడ్డీ ఆడాల్సిందిగా కోరారు. దీంతో బరిలోకి.. అక్కడ ఉన్నవారిని ఉత్సాహపరిచారు. కాగా ఆ సమయంలో ఎవరో వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.  దీంతో ఎంపీ కబడ్డీ ఆడుతోన్న వీడియో తెగ వైరలయ్యింది. కాగా 2008 సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని మాలేగావ్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న పేలుళ్లలో ఎంపీ సాధ్వి నిందితురాలు ఉన్న విషయం తెలిసిందే.  అయితే అనారోగ్య కారణాలపై బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆరోగ్యం బాగాలేదంటూ బెయిల్ తీసుకున్న ఎంపీ బేషుగ్గా కబడ్డీ ఆడుతూ వీడియోలో కనిపించడంతో.. పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

ఈ క్రమంలో తాను కబడ్డీ ఆడుతోన్న సమయంలో వీడియో తీసిన వ్యక్తిపై ప్రజ్ఞా ఠాగూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అతడిని రావణుడితో పోల్చారు. అతనికి సంస్కరం లేదని.. సదరు వ్యక్తి వృద్ధాప్యంలోనే కాకుండా తదుపరి జన్మలో కూడా దారుణ పరిస్థితులు ఎదుర్కుంటాడని ప్రజ్ఞా ఠాకూర్‌ శపించారు.

Also Read: నిద్రిస్తోన్న భర్త మర్మాంగంపై సల సలా కాగుతోన్న వేడినీళ్లు పోసిన భార్య…

 పండుగ తర్వాత భారీ విద్యుత్ కోతలంటూ ఏపీలో ప్రచారం.. ఇందన శాఖ క్లారిటీ

Loading...
Unable to load recommendations.
Follow Us