Covid Vaccine: లబ్ధిదారులకు ఆ అవకాశం లేదు.. టీకా కేంద్రంలో ఏది ఉంటే అదే వేయించుకోవాలి.. స్పష్టం చేసిన కేంద్రం..

|

Jan 13, 2021 | 9:51 PM

Covid Vaccine: మరో మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా..

Covid Vaccine: లబ్ధిదారులకు ఆ అవకాశం లేదు.. టీకా కేంద్రంలో ఏది ఉంటే అదే వేయించుకోవాలి.. స్పష్టం చేసిన కేంద్రం..
Follow us on

Covid Vaccine: మరో మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ వర్గాలు వేగిరం చేశాయి. అటు పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి దేశ నలుమూలలకూ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నారు. మరోవైపు భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్‌నూ దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. దేశంలోని వివిధ నగరాలకు ప్రత్యేక విమానాల ద్వారా తరలిస్తున్నారు. ఈనెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుండగా, తొలి దశలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ప్రాధాన్యతగా వైద్యులు, వైద్య సంరక్షణ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్ వేస్తారు.

ఇదిలాఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం కొవిషీల్డ్, కొవాగ్జిన్(రెండు వేరు వేరు కంపెనీలు) టీకాలను పంపిణీ చేస్తోంది. అయితే వాటిలో ఏది వేసుకోవాలనే దానిని నిర్ణయించుకునే అవకాశం లబ్ధిదారులకు కల్పించలేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. టీకా వేసే ఒక రోజు ముందు సంబంధిత వ్యక్తుల ఫోన్‌కు మెసేజ్ వస్తుందన్నారు. టీకా కేంద్రాల్లో ఏ టీకా అందుబాటులో ఉంటే ఆ టీకానే వేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తేల్చిచెప్పారు. ఇప్పటి వరకు ‘కొవిన్’ యాప్‌లో కోటి మంది లబ్ధిదారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు. వీరికి మొదటి డోసు వేసిన 28 రోజుల తరువాత రెండో డేసు వేస్తామని ఆయన తెలిపారు. కాగా, ప్రపంచ దేశాల్లోనూ లబ్ధిదారులు ఏ టీకా వేయించుకోవాలనే దానిపై అవకాశం కల్పించలేదని ఆయన పేర్కొన్నారు.

Also read:

Telangana Corona Vaccine: తెలంగాణలో ఆయా జిల్లాకు చేరిన కరోనా వ్యాక్సిన్లు.. ఏ జిల్లాకు ఎన్ని డోసులంటే..

Asaduddin Owaisi: యూపీ మాజీ సీఎం అఖిలేష్‌పై సంచలన ఆరోపణలు చేసిన అసదుద్దిన్ ఓవైసీ.. 12సార్లు తనను..