సమరానికి సై.. ఎవరి వ్యూహం వారిదే.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు తెలుగు రాష్ట్రాల ఎంపీలు సిద్ధం

|

Dec 06, 2022 | 9:06 PM

ఎవరి వ్యూహం వారిదే. ఎవరి ఎజెండా వారిదే.! డిసెంబర్‌ 7 నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల కోసం తెలుగు రాష్ట్రాల ఎంపీలు సిద్ధమయ్యారు. పార్లమెంట్ వింటర్‌..

సమరానికి సై.. ఎవరి వ్యూహం వారిదే.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు తెలుగు రాష్ట్రాల ఎంపీలు సిద్ధం
Parliament Sessions
Follow us on

ఎవరి వ్యూహం వారిదే. ఎవరి ఎజెండా వారిదే.! డిసెంబర్‌ 7 నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల కోసం తెలుగు రాష్ట్రాల ఎంపీలు సిద్ధమయ్యారు. పార్లమెంట్ వింటర్‌ సెషన్స్‌లో హైవోల్టేజ్ హీట్‌ ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు ఇప్పటికే జాతీయ పార్టీలు సిద్ధం కాగా.. రీజినల్ పార్టీలు కూడా ప్రత్యేక ఏజెండాతో సమరానికి సై అంటున్నాయి.! తెలుగు రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పలు కీలక అంశాలను ప్రస్తావించేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులతో తెలంగాణలో పొలిటిక్స్ మంచి కాకమీదున్నాయి. దర్యాప్తుసంస్థల దుర్వినియోగంపై విపక్షాలతో కలిసి ఆందోళనలు నిర్వహించడంతోపాటు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని అస్త్రంగా ప్రయోగించాలన్నది టీఆర్‌ఎస్‌ వ్యూహంగా కనిపిస్తోంది.

మరోసారి ప్రత్యేకహోదా ఇష్యూని బలంగా తెరపైకి తెస్తోంది వైసీపీ. విభజన చట్టానికి సవరణ చేసి.. ప్రత్యేక హోదాను అందులో పొందుపరుచాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే ప్రైవేట్‌మెంబర్ బిల్లు యోచనలో ఉంది. విభజన చట్టం హామీలు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ప్రస్తావించనుంది. ఓవైపు వికేంద్రీకరణ వ్యూహంతో వైసీపీ ముందుకెళ్తుంటే.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేయబోతోంది తెలుగుదేశం పార్టీ. దేశ ఆర్థిక పరిస్థితి- అప్పులు, ధరల పెరుగుదల, దర్యాప్తుసంస్థల దుర్వినియోగం, చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీయనున్నాయి విపక్షాలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి