మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన తర్వాత తొలి ఎన్నికలు.. ఏయే పార్టీ ఎంతమంది మహిళా అభ్యర్థులను నిలబెట్టాయంటే..?

|

Nov 12, 2023 | 10:12 AM

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు అంటే నారీ వందన్‌ చట్టం ఆమోదం పొందిన తర్వాత దేశంలో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. అయితే ఈసారి ఎన్నికల్లో మహిళలకు టిక్కెట్లు ఇవ్వడంలో పార్టీ ఎక్కడ ఉంది. 2018తో పోల్చితే దాని స్థితి ఏమిటి..?

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన తర్వాత తొలి ఎన్నికలు.. ఏయే పార్టీ ఎంతమంది మహిళా అభ్యర్థులను నిలబెట్టాయంటే..?
The Women Reservation
Follow us on

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అప్పుడే ఎన్నికల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. మిజోరంలో ఓటింగ్ జరగగా, ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఒక దశ పోలింగ్ జరిగింది. అయితే ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణల్లో రెండో దశ ఓటింగ్‌ పెండింగ్‌లో ఉంది.

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు అంటే నారీ వందన్‌ చట్టం ఆమోదం పొందిన తర్వాత దేశంలో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. అయితే ఈసారి ఎన్నికల్లో మహిళలకు టిక్కెట్లు ఇవ్వడంలో పార్టీ ఎక్కడ ఉంది. 2018తో పోల్చితే దాని స్థితి ఏమిటి..? అనేదీ ఒక్కసారి పరిశీలిద్దాం..

ఏయే రాష్ట్రాల్లో ప్రత్యక్ష పోరు..

మూడు రాష్ట్రాల్లో అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోరు కనిపిస్తోంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలతోపాటు బీఆర్ఎస్ కూడా ఎన్నికల రేసులో దూసుకువస్తోంది. ఇది కాకుండా, మిజోరంలో రెండు ప్రాంతీయ పార్టీలైన జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (JPM), మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) మధ్య ఎన్నికల పోరు జరగడం ఇదే తొలిసారి. సీట్లను పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లో 230, రాజస్థాన్‌లో 200, తెలంగాణలో 119, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరంలో 40 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులను చూస్తుంటే టిక్కెట్ల పంపిణీలో బీజేపీ నారీ వందన్ బిల్లును దృష్టిలో పెట్టుకోలేదని తెలుస్తోంది.

రాజస్థాన్‌లో ఎంతమంది మహిళా అభ్యర్థులు?

200 సీట్లతో రాజస్థాన్‌లో కాంగ్రెస్ అంతర్గత కలహాలతో సతమతమవుతుంటే.. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును బయటపెట్టకుండా మళ్లీ నరేంద్ర మోదీ పేరుతో ఓట్లు దండుకోవాలని బీజేపీ భావిస్తోంది. అభ్యర్థులను పరిశీలిస్తే కాంగ్రెస్ అత్యధికంగా 28 మంది, బీజేపీ 20 మంది, ఆప్ 19 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. రాష్ట్రంలో నారీ వందన్ బిల్లు పెద్ద అంశంగా పరిగణించనప్పటికీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పేపర్ లీక్, లా అండ్ ఆర్డర్, పోలరైజేషన్, అవినీతిని పెద్ద అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది బీజేపీ. అయితే, అధికార వ్యతిరేకత వంటి సమస్యలను ఎదుర్కోవటానికి, కాంగ్రెస్ ఆరోగ్య బీమా, పట్టణ ఉపాధి హామీ, ప్రభుత్వ ఉద్యోగులకు వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి అనేక పథకాలను ప్రకటించింది.

2018తో పోల్చితే ఎన్నికల్లో తక్కువ మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టిన బీజేపీకి రాష్ట్రంలో మహిళా నేతలకు అదరణ పెరిగింది. రాష్ట్రంలో 5 సార్లు ఎంపీగా, 2 సార్లు సీఎంగా పనిచేసిన వసుంధర రాజే ముందుండి బీజేపీని నడిపిస్తున్నారు. అయితే రెండు పార్టీలకు మహిళల ప్రాధాన్యత తెలుసని, వారిని ఆకర్షించేందుకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని, అయితే టిక్కెట్లు ఇచ్చే విషయంలో మాత్రం రెండు పార్టీలు మహిళలకు సమాన అవకాశాలు కల్పించలేకపోతున్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

మధ్యప్రదేశ్ టిక్కెట్ లెక్కలు ఏం చెబుతున్నాయి..?

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లతో మధ్యప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం. గత సారి, 2018లో జరిగిన ఎన్నికల్లో, కాంగ్రెస్ రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. కానీ 2020లో జ్యోతిరాదిత్య సింధియా, అతని మద్దతుదారులను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు ఆ పార్టీలో మళ్లీ అధికార వ్యతిరేకత కలవర పెడుతోంది.

ప్రస్తుతం ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ మహిళల పథకాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళలను కేంద్రంలో ఉంచి బెహన్ యోజన, లక్ష్మి యోజన, ముఖ్యమంత్రి ఆడపిల్లల పెళ్లి వంటి పథకాలను తీసుకొచ్చి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ టిక్కెట్ల పంపిణీ విషయంలో మాత్రం ఆ పార్టీ వెనుకంజ వేసిన్నట్లు కనిపిస్తోంది.

మధ్యప్రదేశ్‌లో టిక్కెట్‌లను పరిశీలిస్తే, 230 స్థానాలకు గాను బీజేపీ 30 స్థానాల్లో మహిళా అభ్యర్థులను, కాంగ్రెస్ 28 స్థానాల్లో మహిళా అభ్యర్థులను, ఆప్ 10 స్థానాల్లో మహిళా అభ్యర్థులను నిలబెట్టింది. రాష్ట్రంలో ఉమాభారతి లాంటి పెద్ద మహిళా నేతలు బీజేపీకి ఉన్నా, కాంగ్రెస్‌కు మహిళా ముఖ్యనేతలు కరువయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఏ పార్టీ.. ఎంత మంది మహిళా అభ్యర్థులు?

మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయిన ఛత్తీస్‌గఢ్‌లో 32 శాతం ఓటు బ్యాంకు గిరిజనులదే. 90 సీట్లున్న ఈ రాష్ట్రంలో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 7న తొలి దశ పోలింగ్ జరగ్గా, నవంబర్ 17న రెండో దశ పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న రమణ్‌సింగ్‌ను ఓడించి, భూపేష్ బఘేల్‌ను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చేసింది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. అయితే, టిక్కెట్ల పంపిణీ విషయానికి వస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చెందిన 18 మంది, బీజేపీకి చెందిన 15 మంది మహిళా అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా మహిళలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ రూ.500 గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీ ఇవ్వడం, మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలను మాఫీ చేయడం, ప్రభుత్వం ద్వారా రూ.10 లక్షల వరకు చికిత్స అందించడం వంటి పథకాలను ప్రకటించింది.

మరోవైపు బీజేపీని గెలిపిస్తే పెళ్లయిన ప్రతి మహిళకు రూ.12వేలు ఇవ్వడమే కాకుండా రాణి దుర్గావతి యోజన కూడా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం కింద, బిపిఎల్ కేటగిరీకి చెందిన ఆడపిల్లలు పుట్టినప్పుడు రూ.1 లక్ష హామీ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఈసారి మహిళల పాత్రే కీలకం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

మిజోరాం ఎన్నికల్లో మహిళల ఆధిక్యం ఎంత?

ప్రస్తుతం మిజోరంలో 40 సీట్లతో మిజో ఫ్రంట్ (MNF) అధికారంలో ఉంది. కాగా మణిపూర్‌లో చాలా కాలంగా కుల హింస కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దాని ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపిస్తుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకలు. కుకీ, జోమి, హమర్ కమ్యూనిటీలకు చెందిన వేలాది మంది ప్రజలు రాష్ట్రంలో ఆశ్రయం పొందారు. మరోవైపు మణిపూర్‌ అంశంలో రాష్ట్రంలో బీజేపీ, ఎమ్‌ఎన్‌ఎన్‌ఎఫ్‌ మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు మణిపూర్‌లో కుల ఘర్షణలు, నిరుద్యోగం, మౌలిక సదుపాయాల లేమి పెద్ద సమస్యలుగా మారాయి.

అదే సమయంలో, మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ ప్రభావం మిజోరంలో కూడా కనిపిస్తుందని రాష్ట్ర ప్రజలు కూడా భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళలన పరిశీలిస్తే రాష్ట్రంలో మహిళలను ముందుకు తీసుకురావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది కానీ రాష్ట్రంలో పితృస్వామ్య ఆలోచన వల్ల అది జరగడం లేదు. ఇక టిక్కెట్ల వారీగా చూస్తే.. రాష్ట్రంలో బీజేపీ 3, జెడ్పీఎం 2, ఎంఎన్ఎఫ్ 2 మహిళలను రంగంలోకి దించాయి.

తెలంగాణలో మహిళలకు ఎంత ప్రాధాన్యత..?

తెలంగాణలో అధికార పార్టీ బీఆర్‌ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి నుంచి బీజేపీ, కాంగ్రెస్‌లు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో టిక్కెట్ల పంపిణీని పరిశీలిస్తే, బీఆర్‌ఎస్ 119 స్థానాల్లో 8, కాంగ్రెస్ 114 స్థానాల్లో 10, బీజేపీ 100 స్థానాల్లో 14 స్థానాల్లో మహిళా అభ్యర్థులను నిలబెట్టాయి. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ మహిళలను కేంద్రంగా చేసుకుని అనేక పథకాలు అమలు చేస్తోంది. షెడ్యూల్డ్ కులాలు, తెగల కోసం తీసుకొచ్చిన రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ్ లక్ష్మి యోజన, మిషన్ భగీరథ వంటి పథకాలు ఇందులో ఉన్నాయి. గెలిచిన తర్వాత, కాంగ్రెస్ 6 హామీ పథకాలను అమలు చేస్తామని జనంలోకి దూసుకుకెళ్తోంది.

ఇప్పటికీ ఈ గణాంకాలు అయా రాష్ట్రల్లో టిక్కెట్ల పంపిణీలో మహిళలకు ఎంత సమానత్వం ఇచ్చాయో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వేచి చూడాలి..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…