ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో రోజుకో వింత వెలుగులోకి వస్తోంది. ఎక్కడ తవ్వితే అక్కడ చరిత్ర వెలుగుచూస్తోంది. సంభల్ జిల్లా చందౌసీ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో పాత మెట్లబావి బయటపడింది.. ఇది రాజా రాణి సురేంద్రవాలా ఎస్టేట్‌గా చెబుతున్నారు. 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మెట్లబావి ఉందని సంభల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా చెప్పారు. ఇందులో నాలుగు గదులు ఉన్నాయని, ఇందులో మూడు అంతస్తులను మార్బుల్‌తో నిర్మించారనీ, ఆపై అంతస్తులు ఇటుకలతో నిర్మించారని ఆయన వివరించారు. 150 ఏళ్ల క్రితం ఈ బావిని నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ బావి నుంచి బంకే బిహారి ఆలయానికి దారి ఉన్నట్టు చెబుతున్నారు.
మెట్లబావి సమీపంలోని ఆక్రమణలు తొలగించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా 210 చదరపు మీటర్ల ప్రాంతాన్ని తవ్వారు. సంభల్‌లో నాలుగు దశాబ్దాల తరువాత బయటపడ్డ శివాలయంలో ఇప్పటికే పూజలు జరుగుతున్నాయి. సంభల్‌లో బయటపడ్డ ఆలయంలో గత రెండు రోజుల నుంచి పురావస్తు శాఖ దర్యాప్తును చేపట్టింది. అయితే 1857లో సిపాయిల తిరుగుబాటు సందర్భంగా ఈ బావిని నిర్మించినట్టు స్థానికులు చెబుతున్నారు. బ్రిటీష్ వాళ్ల కళ్లగప్పి తప్పించుకోవడానికి ఆనాటి పోరాట యోధులు ఈ టన్నెల్‌ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. బావి బయటపడ్డ ప్రాంతం లోనే మరో పురాతన ఆలయం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. సంభల్‌లో ఇలాంటి చాలా ఆలయాలు చాలా ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..