బాబు పచ్చి అవకాశవాది.. నిప్పులు చెరిగిన ఒమర్ అబ్దుల్లా

| Edited By:

Jul 29, 2020 | 6:40 PM

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్ అబ్దుల్లా నిప్పులు చెరిగారు.

బాబు పచ్చి అవకాశవాది.. నిప్పులు చెరిగిన ఒమర్ అబ్దుల్లా
Follow us on

Omar Abdullah slams Chandrababu Naidu: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్ అబ్దుల్లా నిప్పులు చెరిగారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని ఆయన అన్నారు. బాబు కోసం తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా తన సొంత ఎన్నికలు వదులుకొని మరీ ఏపీకి వెళ్లి ప్రచారం చేస్తే.. తాము హౌజ్‌ అరెస్ట్‌లో ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. తమకు మద్దతుగా ఒక్క ప్రకటన కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ క్వీన్ స్వీప్ చేస్తారని తెలిసినా.. తన తండ్రి ప్రచారం చేశారని ఒమర్ తెలిపారు. బాబు ఓడిపోతున్నారన్న విషయం బాబుకు తప్ప అప్పట్లో అందరికి తెలుసని ఒమర్‌ చెప్పుకొచ్చారు. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, హక్కులు కల్పిస్తోన్న ఆర్టికల్ 370, ఆర్టికల్‌ 35ఏలను రద్దుచేయడానికి ముందస్తు జాగ్రత్తగా మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఫరూక్‌ అబ్దుల్లాలను హౌజ్‌ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని నెలల తరువాత వారికి విముక్తిని కలిపించారు.

Read This Story Also: భారీ స్కామ్‌.. కోట్లు నష్టపోనున్న రమ్యకృష్ణ, నయనతార!