కరోనాతో నర్సు మృతి.. పీపీఈ కిట్‌లే కారణమా..!

| Edited By:

May 26, 2020 | 11:35 AM

కరోనా సోకి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే అంబిక(46) అనే నర్సు మృతి చెందింది. ఈ నెల 21న సాఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చేరిన ఆమె.

కరోనాతో నర్సు మృతి.. పీపీఈ కిట్‌లే కారణమా..!
Follow us on

కరోనా సోకి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే అంబిక(46) అనే నర్సు మృతి చెందింది. ఈ నెల 21న సాఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ 24న కన్నుమూసింది. ఢిల్లీలో కరోనాతో మృతి చెందిన మొదటి నర్సు అంబిననే. కాగా అంబిక మరణానికి పీపీఈ కిట్‌లే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలోని కర్ల ఆసుపత్రిలో అంబిక పనిచేస్తుండగా.. వాడిన పీపీఈ కిట్‌లనే తిరిగి ధరించడం వలన చనిపోయినట్లు ఆమె తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

దీనిపై కర్ల ఆసుపత్రిలో పనిచేసే సీనియర్ నర్సు మాట్లాడుతూ.. ”ఇక్కడ డాక్టర్లకు కొత్త పీపీఈ కిట్‌లు ఇస్తూ, నర్సులను మాత్రం వాడినవే మళ్లీ వేసుకోమంటున్నారు. ఒకవేళ మేము ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. మనం రిస్క్‌లో ఉన్నాం. కచ్చితంగా పీపీఈలను తిరిగి వాడాల్సిందే అని చెబుతున్నారు” అని పేర్కొన్నారు. ఇక అంబికాకు సన్నిహితంగా ఉండే మరో నర్సు మాట్లాడుతూ.. గత వారం తమకు కొత్త పీపీఈ కిట్‌లు ఇవ్వాలంటూ నర్సింగ్‌ ఇన్‌ఛార్జితో అంబిక గొడవ పెట్టుకున్నట్లు తెలిపారు.

ఇక అంబిక మరణంపై ఆమె కుమారుడు అఖిల్ మాట్లాడుతూ.. ”మా అమ్మ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ వచ్చింది. వారం క్రితం నాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో వాడిన పీపీఈ కిట్‌లనే వాడమని చెప్తున్నారని, మాస్క్‌లకు సైతం డబ్బులను తీసుకుంటున్నారని తెలిపింది. ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండమని నేను మా అమ్మకు సూచించా. కానీ తను నా మాటను వినలేదు. అలానే పనిచేసింది. ఇప్పుడు మాకు దూరంగా వెళ్లిపోయింది” అని అన్నారు. అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం ఖండించింది. ఆసుపత్రి యజమాని డా. ఆర్కే కర్ల మాట్లాడుతూ.. తమ దగ్గర పనిచేసే ఉద్యోగులందరికీ పీపీఈ కిట్లు, హ్యాండ్‌ వాష్‌లు అందుబాటులో ఉంచామని అన్నారు. ఒకవేళ అలా ఏదైనా జరిగిందని నా వరకు వస్తే.. దర్యాప్తు చేయింది, కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేయాలంటూ కేరళలోని పతనందిట్ట ఎంపీ ఆంటో ఆంటోనీ ప్రధాని మోదీకి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. కాగా కేరళకు చెందిన అంబిక ఢిల్లీలో తన 16 ఏళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త మలేషియాలో ఉండగా.. కుమారుడు కేరళలో చదువుకుంటున్నాడు.

Read This Story Also: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఆహుతైన 1500 గుడిసెలు..!