Tamilnadu Government:తమిళ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ మూడు రోజులు పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో అనుమతి లేదు

|

Jan 13, 2021 | 2:33 PM

Tamilnadu Government: తమిళనాడు సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక ప్రాంతాలతో పాటు అధికంగా జనాలు గుమిగూడే ప్రాంతాలను జనవరి 15 నుంచి 17 వరకు ...

Tamilnadu Government:తమిళ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ మూడు రోజులు పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో అనుమతి లేదు
Follow us on

Tamilnadu Government: తమిళనాడు సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక ప్రాంతాలతో పాటు అధికంగా జనాలు గుమిగూడే ప్రాంతాలను జనవరి 15 నుంచి 17 వరకు మూసివేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉందని, దీంతో కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని ముందస్తుగా తమిళ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు ఈ సమయం ప్రజారోగ్యానికి హానికరమని భావించి పబ్లిక్‌ ప్రదేశాల్లో ఎవరినీ అనుమతించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్‌, వండలూరు జూ, మమల్లపురంలోని పర్యాటక ప్రాంతాలు, గుండిలోని నేషనల్‌ పార్క్‌, చెంగల్పట్టులోని పర్యాటక ప్రాంతాల్లో జనవరి 15 నుంచి 17 వరకు ఎవ్వరిని అనుమతించరు. వీటితోపాటు రాష్ట్రంలోని ప్రజలు ఎక్కువగా గుమిగూడేందుకు అవకాశం ఉన్న ప్రదేశాల్లోకి కూడా ఈ మూడు రోజుల పాటు అనుమతి ఉండదని ప్రభుత్వం తెలిపింది. కోవిడ్‌ ప్రభావం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇలాంటి పండగల సమయాల్లో జనాలు అధిక సంఖ్యలో గుమిగూడి ఉండటం వల్ల కోవిడ్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనాతో ఎన్నో ఇబ్బందులకు గురవుతూ కోవిడ్‌ను కట్టడి చేస్తుంటే ఇలాంటి సమయంలో మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రైతు చట్టాల ప్రతులను తగులబెడతాం, ఇవే మాకు చలిమంటలు,అన్నదాతల హెచ్ఛరిక..ఇక ఆందోళన ఉధృతికే నిర్ణయం